కరీంనగర్

24 గంటల కరెంట్.. కాంగ్రెస్ ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, సెప్టెంబర్ 20: రైతులకు 24 గంటల కరెంట్‌ను తీసుకవచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని టీపిసిసి ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్ ఆరెపల్లి మోహన్ అన్నారు. గురువారం మండల పరిధిలోని శ్రీనివాస్‌నగర్, గంగిపల్లి, మద్దికుంట, ఈదులగట్టెపల్లి గ్రామంలో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమంలో ఆరెపల్లి మోహన్, జిల్లా నేత డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని జెం డాను ఎగరవేసిన్నారు. శ్రీనివాస్‌నగర్, మద్దికుంట గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సుమారు 300 మంది బుర్ర రమేష్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు ఆరెపల్లి కండువా కప్పి ఆహ్వానించారు. గ్రామంలోని వచ్చిన ఆరెపల్లి మోహన్‌కు డప్పుచప్పులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరెపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. టిఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో కేసిఆర్ చేసిన అభివృద్ధి ఏమీలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇచ్చిన హామీలను నేరవేరుస్తామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి , ప్రజలకు సేవచేసేందుగాను ఒక్కసారి కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేగా ప్రజలు అదరించి ఎన్నికల్లో గెలించాలని కోరారు. నేతలు బాపురెడ్డి, గసికంటి సంపత్, రవింద్రచారి, రమేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

26న జగిత్యాలలో జాబ్‌మేళా
* జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు
జగిత్యాల టౌన్, సెప్టెంబర్ 20: జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకుగానూ ఈనెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్న జిల్లా ఉపాధి కల్పనాధికారి వై. తిరుపతిరావు అన్నారు. గురువారం స్థానిక విలేఖరులతో తిరుపతిరావు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని పేరంగ్రూప్ కంపెనీలోని మార్కటింగ్ మేనేజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కలవని, ఎస్సెస్సీ ఉత్తీర్ణులై 18నుండి 20యేళ్లు నిండి ఉన్న అభ్యర్థులు అర్హులని ధరూర్ క్యాంప్‌లో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో విద్యా అర్హత సర్ట్ఫికెట్లతో హాజరుకావాలని కోరారు.

టీఆర్‌ఎస్‌ను ఓడించాలి
* సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా వారి హక్కులు కాలరాస్తున్న టీఆర్‌ఎస్‌ని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పీ.జయలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశం సంఘం అధ్యక్షుడు యు.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్ర భుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనం రూ.18 వేలు, దినసరి కూలీ కూడా గిట్టుబాటు అయ్యే లా చర్యలు తీసుకోకపోవటం శోచనీయమన్నారు. అనేక ఉద్యమాలు, పోరాటా లు చేసినా కార్మికులను అణిచి వేస్తూనే కార్పొరేట్ శక్తులకు వంతపాడుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి బండారి శేఖర్, ఉపాధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి, ప్రతినిధులు ఎడ్ల రమేశ్, స్వామి, పిల్లి రవియాదవ్, జనగాం రాజమల్లు, కొమురయ్య, మల్లయ్య, రమపతిరావు పాల్గొన్నారు.

కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తాం
* కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం
చొప్పదండి, సెప్టెంబర్ 20: రానున్న ఎన్నికల్లో రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంతో గురువారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున టపాసులు కాల్చి, స్వీట్లను పంచి పెట్టారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధియేనని, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సోనియాగాంధి తెలంగాణ ఇవ్వకుంటే వచ్చేది కాదని అర్థం చేసుకున్నారని, అందుకే రానున్న ఎన్నికల్లో ప్రజలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ నియంతృత్వ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయారని, ఈ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీకి నూకలు చెల్లాయన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పొన్నం ప్రభాకర్‌ను, రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్తేజం నెలకొందన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరెల్లి చంద్రశేఖర్, సింగిల్‌విండో చైర్మన్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముద్దం తిరుపతి, రాష్ట్ర బిసి సెల్ కోఆర్డినేటర్ తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, కడారి శంకర్, సుద్దపల్లి గంగయ్య, వెల్మ రాజిరెడ్డి, సత్తు శ్రీనివాస్, కొట్టె అశోక్, రాజేందర్, చాంద్ పాషాతో పాటు పలువురు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.