కరీంనగర్

పత్తికి కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయకుంటే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 20: ఖరీఫ్ సీజన్‌లో రైతు లు పండించిన పత్తికి కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మార్కెటింగ్ అధికారులు, సీసీఐ అధికారులతో పత్తి మద్దతు ధరపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పత్తికి నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.5,450 చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కనీస మ ద్దతు ధరకు తక్కువ చెల్లించి కొనుగోలు చేసేవారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, హుజూరాబాద్, గోపాలరావుపేట మార్కెట్ యార్డులలో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు తమ పత్తిని ఆరబెట్టి చెత్తా చెదారం లేకుండా 8శాతం తేమ ఉండేలా మార్కెట్ యార్డుకు తీసుకు వస్తే కనీస మద్దతు ధర లబిస్తుందని చెప్పారు. 12శాతం కంటే తేమ ఎక్కువ ఉంటే సీసీఐ కొనుగోలు చేయదని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కనీస మద్ధతు ధరకు దగ్గరలోని పత్తి మిల్లుల వద్ద అమ్ముకునేందుకు త్వరలో నోటిఫై చేస్తామని అన్నారు. మార్కెట్ యార్డులలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మార్కెట్ యార్డులలో తేమ కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. తూకం యంత్రాలను తనిఖీ చేసి సర్టిఫై చేయాలని ఆదేశించారు. వే బ్రిడ్జిల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త రైతులు పత్తితో సంబంధిత వ్యవసాయ విస్తర్ణ్ధాకారి దృవీకరణ పత్రంతో మార్కెట్‌కు వస్తే అనుమతించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, వ్యవసాయాధికారి శ్రీ్ధర్, ఆర్‌డిఓలు ఆనంద్ కుమార్, చెన్నయ్యలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

మతాలకు అతీతంగా గణేష్ పూజలు
* ఎస్పీ సింధూశర్మ
కోరుట్ల, సెప్టెంబర్ 20: కుల, మతాలకు అతీతంగా వినాయక వేడుకలు నిర్వహించుకోవడం, ముస్లిం సోదరులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలవడం అభినందనీయమని ఎస్పీ సింధూశర్మ కొనియాడారు. కోరుట్ల ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి కుల,మతాలకు అతీతంగా వేడుకలు జరుపుకోవడం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సింధూశర్మ మా ట్లాడుతూ హిందూ -ముస్లిం భాయ్‌భాయ్ అంటూ హిందువుల పండగలలో ముస్లిం సోదరులు.. ముస్లింల పండుగలలో హిందువులు పాల్గొన డం అభినందనీయన్నారు. ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులు వినాయక నవరాత్రోత్సవాలు, సామాజిక సేలా కార్యక్రమాలు చేస్తూ జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వినాయక మండపంలో ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులను శాంతియువత వాతావరణంలో జరుపుకుంటున్నట్లుగానే నిమజ్జనం కూడా భక్తిశ్రద్ధలతోనే చేయాలని ఎస్పీ సింధూశర్మ సూచించారు. కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐ సతీష్‌చందర్‌రావు, ఎస్సై రవికుమార్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, టీ యుడబ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షుడు గం గుల రాంగోపాల్, జిల్లా కన్వీనర్లు శికా రి రామకృష్ణ, దొమ్మాటి అంజూగౌడ్, ఆకుల మల్లిఖార్జున్, సలీంఫారూఖీ, సాజిత్, చాంద్, అనాస్, హైమ్మద్, సజ్జు, సలావొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కే. విద్యాసాగర్‌రావు, మాజీమంత్రి తనయుడు జువ్వాడి కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్, వైస్‌చైర్మన్ రఫియొద్దీన్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్, ఎఎంసీ చైర్మన్ సింగిరెడ్డి నారాయణరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

స్టార్టప్ ఇండియాపై బూట్ క్యాంప్
* నేడు జిల్లా కేంద్రానికి చేరనున్న బస్సుయాత్ర
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 20: దేశవ్యాప్తంగా యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించే నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా బూట్ క్యాంప్ చేపడుతున్నట్లు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల బోధన సిబ్బంది తెలిపారు. గురువారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో స్టార్టప్ కో ఆర్డినేటర్లు రాధికారెడ్డి, గడ్డం శ్రీ్ధర్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా సరికొత్త ఆలోచనలతోవచ్చే యువ వ్యాపారవేత్తలకోసం కొత్త ఆవిష్కరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో నోడల్ సెంటర్లు ప్రకటించగా, జిల్లానుంచి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల ఎంపికైందని వెల్లడించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకు దేశవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తుండగా, నేడు జిల్లాకు చేరనుందని వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్కస్ గ్రౌండ్‌లో, రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎస్సారార్ కళాశాలలో బస్సుయాత్రలో పాల్గొంటున్న పలు కంపనీల ప్రతినిధులు విద్యార్థులతో మాట్లాడుతూ, అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఔత్సాహిక విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుని, ఈనెల 24న జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలోబూట్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్యాంపులో పలురకాల పరిశ్రమలకు చెందిన అనుభవజ్ఞులు వచ్చి విద్యార్థుల్లో దాగి ఉన్న సరికొత్త ఆలోచనలను వ్యాపార పరిశ్రమలుగా మల్చుకునేందుకు ఊతమిస్తారని, ఉపయోగకరమైన ఆలోచనలు పంచుకునే విద్యార్థులను రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపిక చేసి, బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.