కరీంనగర్

భక్తిశ్రద్ధలతో కాలసర్ప శాంతి పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, సెప్టెంబర్ 21: ధర్మపురి క్షేత్రంలోని వేంకటేశ్వరాలయంలో శుక్రవారం సంపూర్ణ కాలసర్ప శాంతి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం కాలసర్ప పూజలలో పాల్గొన్న భక్తులు, వార్షిక శుక్రవారోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారాలను బట్టి వాసుకి, తక్షక, ఐరావత, ధనంజయ, కర్కోటక, శంఖపాల, అనంత, శేష అనే జాతుల సర్పాలు భూమిపై సంచరించగలని పురాణ కథనం. పూర్వీకులెవరైనా తెలిసో, తెలియకో అట్టి సర్పాలను హతమార్చినా, గ్రహ స్థితులు, ఇతర కారణాల వల్ల సర్పదోశం కలుగుతుందనేని విశ్వాసం. అలాంటి దోషాన్ని, పాపాన్ని నివారణ చేసుకునేందుకు, సర్ప శాపవిమోచన ద్వారా సంతానాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, వివాహాది శుభ కార్యాలు, మనశ్శాంతి కలుగుటకు వీలుగా సంపూర్ణ సర్పశాంతి పూజలను నృసింహ క్షేత్రంలో నిర్వహించడం అనాదిగా ఆచరణలో ఉంది. శ్రీవేంకటేశ్వరాలయంలో దేవస్థాన ఉప ప్రధానార్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య, శ్రీ్ధరాచార్య, వామనాచార్య, మోహన్, సంతోష్ శర్మ, శుక్రవారం ఉదయం ఆయా సర్పదేవతల ప్రతిమలను ఎనిమిది దిక్కులలో మండల ఆకారంలో ఉంచి, గోధుమపిండితో సర్పాకృతి చేసి, ప్రాణ ప్రతిష్ఠలు గావించి, అష్ఠనాగ పూజావిధానం వేదోక్త సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ప్రత్యేక పూజానంతరం పిండితో చేసిన సర్పాకృతులను జల ప్రవాహంలో వదలడం ద్వారా సర్పదోష నివారణ కార్యక్రమాన్ని జరిపించారు. రాహు కేతువుల గ్రహ స్థితుల ఆధారంగా సర్పదోశం కల భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.