కరీంనగర్

మహిళా సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, సెప్టెంబర్ 21: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని వేములవాడ ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతీ మహిళకు ఉచితంగా లక్ష రూపాయలు ఖాతాలో జమ చేస్తామన్నారు. మహిళా సంఘాలకు ఇస్తున్న ఐదు లక్షల రుణాన్ని పది లక్షలకు పెంచుతామన్నారు. అభయ హస్తం పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. 58 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి రెండు వేల రూపాయల పెన్షన్‌ను అందిస్తామన్నారు. నిరుపేదలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా అందిస్తామన్నారు. ప్రతీ మహిళా సభ్యురాలికి ప్రమాద బీమా కింద ఐదు లక్షలు చెల్లిస్తామన్నారు. విఓలకు నెలకు పది వేల వేతనాన్ని పెంచుతామన్నారు. రైతులు పండించిన పంటలకు పెద్దఎత్తున మద్ధతు ధర చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు అభివృద్ధిని పట్టించుకోకుండా, స్థానికంగా ఉండకుండా ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. అనంతరం రుద్రంగి మండల కేంద్రంలోని సహస్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి వంటలు చేసే కార్యక్రమంలో గరిటె తిప్పి వారితో పాలు పంచుకున్నారు. కార్యక్రమంలో నాయకులు చెలకల తిరుపతి, సంతోష్ రెడ్డి, పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.
అసెంబ్లీ రద్దు .. కేసీఆర్ అసమర్థపాలనే
* మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, సెప్టెంబర్ 21: అసెంబ్లీ రద్దు కేసీఆర్ అసమర్థపాలనేనని, వాగ్థానాలు అమలు చేయక కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చారని జగిత్యాల తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో అంశాలను రూపొందిన కాంగ్రెస్ లక్ష్యం ఫ్లెక్సీని జీవన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు 2లక్షల రుణమాఫీ, 58యేళ్లకే వృద్ధాప్య, బీడీ కార్మికులకు,వితంతు, ఒంటరి మహిళలకు రూ. రెండువేల పింఛన్, గృహ అవసరాలకు మహిళలకు ఏడాదికి 6 ఉచిత సిలిండర్లు, తెల్ల రేషన్‌కార్డు దారులకు కిలో చక్కెర, రూపాయికే కిలో సన్న బియ్యం, దళిత కుటుంబాలకు ఉచితంగా రేషన్, మహిళలకు బ్యాంక్ రుణాలలో వడ్డీ రాయితీ, లక్ష గ్రాంట్, రైతులు,రైతు కూలీలకు,తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి ఉచిత బీమా, ఇల్లులేని నిరుపేదలకు 5లక్షల రాయితీతో ఇండ్ల నిర్మాణాలు, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,నిరుద్యోగ భృతి రూ. 3వేలు, ఎన్‌ఆర్‌ఐ మృతులకు ప్రభుత్వ పరంగా రూ. 5లక్షల సాయం, ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో ఓపిఎస్ అమలు, తాత్కాళిక ఉద్యోగుల క్రమబద్దీకరణ మరెన్నో పథకాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రవేశపెడతామన్నారు. కాం గ్రెస్ రూపొందించిన లక్ష్యంతో టీఆర్‌ఎస్ నాయకుల్లో జంకు పుట్టిందని జీవన్‌రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, గర్వందుల నరేష్‌గౌడ్, తోపారపు రజినీకాంత్, కాలగిరి రాంచందర్‌రెడ్డి ఉన్నారు.