కరీంనగర్

వ్యాపార రంగాభివృద్ధి కోసమే.. స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 21: దేశంలోని యువతలో వ్యాపార నైపుణ్యాలు వెలికితీస్తూ పారిశ్రామిక రంగాభివృద్ధిని కొనసాగించే క్రమంలోనే స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆరంభించగా, తెలంగాణ లో కూడా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొర వ తీసుకుంటుందని స్టార్టప్ ఇండియా ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కరణ్‌దీప్ సింగ్ అన్నారు. స్టార్టప్ ఇండియా తె లంగాణ యాత్ర పేర ఈనెల 15నుంచి రాష్ట్రంలో కొనసాగుతున్న బస్సు యాత్ర శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈసందర్భంగా నగరంలోని అంబేద్కర్ స్టేడియం, కలెక్టరేట్, ఎస్సారార్ కళాశాల ఆవరణలో విద్యార్థులు, యువతకు యాత్ర ఉద్దేశం వివరిస్తూ, కొత్త ఆలోచనలతో రాష్ట్రాన్ని సరికొత్తగా అభివృద్ధిపథంలోకి తీసుకెళ్ళటంపై ఆయన అవగాహన కల్పించారు. కేవలం మెట్రోనగరాలకే పరిమితమైన వ్యాపార పరిశ్రమలను ద్వితీయశ్రేణి పట్టణాల్లో సైతం స్థాపించి, అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తూ, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, ఇంటర్, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులతో పాటు, సాధారణ పౌరు ల్లో కూడా వచ్చే నూతన ఆలోచనలకు వ్యాపార,పరిశ్రమల రూపమివ్వాలనే సంకల్పంతో, వారిలో నేరుగా అవగాహన కల్పించి, ప్రోత్సహించటమే ధ్యేయంగా కేంద్రం సహాకారంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తూ, పలురకాల పోటీలు నిర్వహిస్తూ, గెలుపొందిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం రాష్టవ్య్రాప్తంగా పలు జిల్లాల్లో బూట్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పాల్గొనే వారి పేర్లు నమోదు చేసుకుంటున్నట్లు తెలిపారు. అంతకుముందు వినూత్న ఆలోచనలతో, స్థాపించిన సరికొత్త పరిశ్రమలు, వాటి యజమానుల అభిప్రాయాలు ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు వివరించారు. జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, కార్యదర్శి సుమిత్‌సాయి మాట్లాడుతూ, బూట్ క్యాంపుకు నగరంలోని ఆసక్తిగల విద్యార్థులు, యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ఏకదాటిగా కురిసిన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో విద్యార్థులు, యువత బస్సుయాత్రలో పాల్గొనగా, 50కి పైగా మంది తమ ఆలోచనలు వెల్లడించేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ అధికారి విశ్వప్రకాశ్‌బాబు, కో ఆర్డినేటర్లు గడ్డం శ్రీ్ధర్, వెంకటేశ్వరన్, తదితరులు పాల్గొన్నారు.
రూ.9.99.999 కరెన్సీతో..
గణేశుడికి అలంకరణ
సుల్తానాబాద్, సెప్టెంబర్ 21: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడికి శుక్రవారం రాత్రి 9,99,999 రూపాయల కరెన్సీతో అలంకరణ చేశారు. దీంతో గణపయ్య ఎంతగానో ఆకట్టుకున్నాడు. 50, 10 రూపాయల నోట్లతో తయారు చేసిన దండలతో రణాలతో గణనాథుడి మండపాన్ని కలర్ కలర్ లైటింగ్ మధ్య చూపరులను అలరించాయి. ఈ కరెన్సీ అలంకరణ చూడటానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. పూజారి పారువెల్ల రా మ్మూర్తి శర్మ గణనాథుడి వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు, సభ్యులు మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

28,29న టోకెన్ సమ్మె

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 21: ఈనెల 28,29 తేదీల్లో ఒప్పంద, పొరు గు సేవల ఉద్యోగుల టోకెన్ సమ్మె చేపట్టనున్నట్లు కాంట్రాక్టు, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ తెలిపారు. శుక్రవారం నగరంలోని ముకుందలా ల్‌మిశ్రా భవన్‌లో నిర్వహించిన ఉ మ్మడి జిల్లా పరిధిలోని అన్ని విభాగా ల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్ టైం, టైంస్కేల్, ఎన్‌ఎంఆర్, కంటింజెన్సీ, ఇతర ఉద్యోగులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు లక్షల మంది ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను టీఆర్‌ఎస్ ప్రభు త్వం మోసం చేసిందని, ప్రభుత్వ పనులన్నీ వందకు 90 శాతం వీరితోనే చేపిస్తూ, సమస్యల పరిష్కారంలో మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. కనీస వేతన సవరణ, ఐఆర్, సమాన పనికి సమాన వేతనం అమలు చేయటం లేదని మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వ మోసాన్ని ఎండగట్టి, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌కు ముందే సమ్మె చేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తమ మేనిఫెస్టోలో పొం దుపర్చే పార్టీలకే తమ మద్దతు తెల్పనున్నట్లు ప్రకటించారు. లేనిపక్షంలో ఓటు ద్వారా తమ తడాఖా చూపుతామని హెచ్చరించారు. అనంతరం ఈనెల 28న హైద్రాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ గోడప్రతులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ ఎడ్ల రమేశ్, పలు విభాగాల ప్రతినిధులు ఆంజనేయులు, రాజశేఖర్, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉద్యోగులు సంజీవ్, స్వామి, పద్మ, రవి, రాజేందర్, సుగుణ, వసంత, తదితరులు పాల్గొన్నారు.