కరీంనగర్

ఎల్లంపల్లికి భారీగా వరద నీరు * 10 గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, సెప్టెంబర్ 21: శ్రీపా ద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రా జెక్ట్ నిండు కుండలా కనిపిస్తోంది. 148 ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్‌కు ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 147.90 లెవల్‌లో నీటిమట్టం ఉండటంతో శ్రీపాద ప్రాజెక్ట్‌లో శుక్రవారం రోజున 19.8976 టీఎంసీల (శ తకోటి ఘనటపు అడుగుల) నీరు ని ల్వ ఉంది. ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతున్న కారణంగా ప్రస్తుతం 10 గేట్లు ఎత్తి 38,764 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడిచి పెడుతున్నట్లు ప్రాజెక్ట్ ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, ఎల్లంపల్లి నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా నిర్మిస్తున్న సుందిల్ల బ్యారేజీ, గోలివాడ పంప్‌హౌస్ నిర్మాణ పనులకు కొంత ఆటంకం ఏర్పడింది.
ఎన్నికల నిర్వహణకు..
సన్నద్ధంగా ఉండాలి

* రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్

పెద్దపల్లి, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు జరిగిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు సమర్థవంతంగా పూర్తిచేయాలని, ఎన్నికల నిర్వహణకు సన్నద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు వంటి అంశాలపై శుక్రవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్స్ లో సమీక్షా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్దం కవాలని, ఎన్నికల కోసం ఉపయోగించే సిబ్బంది వివరాలను పోలింగ్ స్టేషన్ వారిగా ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పటికే జిల్లాకు ఈవిఎంలు చేరాయని, త్వరలోనే వివివ్యాట్ యంత్రాలు కూడా జిల్లాకు చేరుతాయని తెలిపారు. అనంతరం వాటిపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, రాజకీయ పార్టీలకు, ప్రజలకు వాటి పనితీరును వివరించాలని ఆదేశించారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా గుర్తించాలని, 18నుంచి 19 వయస్సు గలవారి లిస్టు, 19నుంచి 21 వయస్సు గల వారి లిస్టు ప్రత్యేకంగా రూపొందించాలని అధికారులు ఆయన ఆదేశించారు. ప్రజలను నుండి వస్తున్న అభ్యంతరాలను ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని తెలిపారు. సెప్టెంబర్ 25 వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 4 వరకు వాటిని పరిష్కరించాలని, అక్టోబర్ 8 నాటికి ఫైనల్ ఓటర్ల లిస్టు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేన, జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో నరసింహమూర్తి, పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు ఉపేందర్‌రెడ్డి, నగేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలి

* పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి పిలుపు

కరీంనగర్, సెప్టెంబర్ 21: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజెఎస్‌లతో మహాకూటమి ఏర్పాటైందని, అయితే ఇంకా సీట్ల ఖరారు జరుగలేదని, సీట్ల విషయంలో బెట్టుకు పోకుండా గెలిచే స్థానాల్లో తప్పకుండా టీడీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీ అభ్యర్థుల ఎంపిక కమిటీ సభ్యు డు మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మారిన రాజకీయ సమీకరణలు, పార్టీ స్థితిగతులు, ప్రత్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకొని ముందుకువెళ్లాల్సిన అవసరముందన్నారు. అనంతరం కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి , పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి , కరీంనగర్ నియోజకవర్గ సమన్వయకర్త కల్యాడపు ఆగయ్య మాట్లాడారు. పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు తాజోద్దీన్, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కన్వీనర్ బుచ్చిలింగం, నాయకులు నసీర్, శ్రీనివాస్‌రెడ్డి, జిమీ బాబు, వెంకటేశ్వర్‌రావు, భాస్కర్‌రెడ్డి, అంజలిదేవితోపాటు పలువురు నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.