కరీంనగర్

వినాయకులకు విశేష పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, సెప్టెంబర్ 22: సనాతన సంప్రదాయాలకూ, భక్తి ప్రపత్తులకూ అనాదిగా నిలయమైన ధార్మిక క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో గణేశ నవరాత్రి ఉత్సవ వేడుకల సందర్భంగా శనివారం ప్రత్యేక పూజాదికాలను నిర్వహించారు. త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు స్థాపించిన సైకత లింగం గల పౌరాణిక, చారిత్రిక, ఐతిహాసిక ప్రాధాన్యతను కలిగియున్న శ్రీరామలింగేశ్వరాలయంలోని ప్రాచీన కాలపు గణేశ మందిరంతోపాటు, ప్రధానాలయంలో ప్రతిష్ఠిత విఘ్న నాయకునికి, అలాగే వంశపారం పర్యంగా కొనసాగుతున్న శ్రీరామానందేశ్వర, నర్మదేశ్వర, చంద్రశేఖర, చంద్రవౌళీశ్వర, రాజరాజేశ్వర, ఓంకారేశ్వర మందిరాలలో, వాడవాడనా గల శివ పంచాయతనాలలో, కాశెట్టివాడ, బోయవాడ, తెనుగువాడ, సారగమ్మవాడ, హన్మాన్‌వాడ, పాలెపువాడ, మహేంద్ర యూత్, భగత్ నగర్, దం మారో దం, యంగ్‌స్టార్ యూత్, అంబేడ్కర్ యూత్ తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వీధివీధినా, వాడవాడలా ప్రతిష్ఠించిన గణేశ విగ్రహాలకు శనివారం నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజాదిక కార్యక్రమాలు నిర్వహించారు. వేదోక్త సాంప్రదాయ పద్దతిలో, క్షేత్ర ప్రాచీన వారసత్వ ఆచారం ప్రకారం వివిధ ఆలయాలలో ప్రతిష్ఠిత విగ్రహాలకు శోడషోపచార, ప్రత్యేక నిశి పూజలను భక్తజన సమక్షంలో సనాతన పద్ధతిలో నిర్వహించారు. ఆయా నిర్వాహకుల ఆధ్వర్యంలో క్రమ పద్దతిలో ఆదివారం సాయంత్రం గోదావరి నది వరకు ఊరేగింపులు నిర్వహించి నదిలో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.

అన్నదానం
ధర్మపురి, సెప్టెంబర్ 22: ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవ వేడుకల సందర్భంగా శనివారం కాశెట్టివాడలోని వెంగ్స్‌యూత్ ఆధ్వర్యంలో, అంబేడ్కర్ నగర్‌లో వేరువేరుగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో అవిభక్త కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గణేశుల ప్రత్యేక పూజలను గావించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లాగౌడ్, ధర్మపురి ఎంపీటీసీ దినేశ్, నాయకులు చుక్క రవి, చిలుముల లక్ష్మణ్, దూడ రమేశ్, వెంగ్స్‌యూత్ పాల్గొన్నారు.

ఘన సన్మానం
సుల్తానాబాద్, సెప్టెంబర్ 22: పట్టణంలోని ఆర్మవైశ్య భవన్‌లో గణేష్ నవరాత్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు గాను పట్టణ ఆర్మవైశ్య సంఘం అధ్యక్షుడు కొమురవెల్లి రాంమూర్తి, వాసవి మాతా దేవాలయ చైర్మన్ చకిలం మారుతీలను శనివారం ఆర్యవైశ్య సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. వీరితో పాటు గణేష్ ఉత్సవాలను విజయవంతానికి కృషి చేసిన కార్యవర్గాలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. నేతలు నగునూరి అశోక్, అల్లెంకి సత్యనారాయణ, మాడూరి ప్రసాద్, సిరిపురం రమేష్, కరుణాకర్, పల్ల కిషన్, పల్ల సురేష్, శ్రీనివాస్, అరుణ్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గొల్లపల్లి, సెప్టెంబర్ 22: మండలంలోని చందోళిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముల్క జీవన్ (25)అనే యువకుడు శనివారం మృతిచెందాడు. బొంకూరి గ్రామానికి చెందిన జీవన్ గణపతి నిమజ్జనానికి బ్యాండ్ కొట్టడానికి చందోళి వెళ్లి తిరిగి వస్తుండగా బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు డివైడర్ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య, రెండు నెలల పాప ఉంది. ఎస్సై కిరణ్‌కుమార్ కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.