కరీంనగర్

బందీ అయిన తెలంగాణను విముక్తం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, సెప్టెంబర్ 22: అనేకానేక పోరాటాలు, ఉద్యమాలు, విద్యార్థుల యువకుల బలిదానాల ద్వారా సాధించిన తెలంగాణ స్వరాష్ట్రం, ప్రస్తుతం బందీ అయిపోయిందని, దానిని విముక్తి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ దరువు ఎల్ల న్న అన్నారు. శనివారం ధర్మపురి క్షేత్రంలో పాత్రికేయుల సమావేశంలో ఎల్లన్న మాట్లాడుతూ నేడు తెలంగాణ కేసిఆర్ కుటుంబం చేతిలో బందీగా మారిందని ఆరోపించారు. అమరుల ఆకాంక్షలను అభాసుపాలు చేసి, నీళ్ళు నిధులు నియామకాలు మరిచి, కమీషన్ల కాకతీయ, భగీరథ పథకాల పేరుతో వేల కోట్ల ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తున్నారని, రానున్న ఎన్నికలలో ఓటమి తప్పదని భయంతో ముందస్తుగా శాసనసభను రద్దు చేసి, ఎన్నికలకు తెర లేపారన్నారు. తెరాసను, కేసిఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించ డానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఓయూ విద్యార్థుల పోరాటం, బలిదానాలకు చలించిన నాటి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం గైకొన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను నట్టేట ముంచుతున్న సంగతిని ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. కార్యక్ర మంలో జేఏసి నేత కండ్లె మదన్, న్యాయవాది కొమ్ము శేఖర్, నాయకులు లక్ష్మణ్, ప్రసాద్, ప్రశాంత్, చంద్రశేఖర్, స్వామి, గంగాధర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలి
ధర్మపురి, సెప్టెంబర్ 22: రానున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జనానా దామాషా ప్రకారం 50శాతం ఉన్న వెనకబడిన కులాల వారికి సముచిత న్యాయం చేసే పార్టీలకే బీసీల మద్దతు ఉండగలదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాచలం ఉమామహేశ్ అన్నారు. శనివారం ధర్మపురి క్షేత్రంలో పాత్రికేయుల సమావేశంలో ఉమామహేశ్ మాట్లాడుతూ, బీసీ సంక్షేమ సంఘ భవనాలకు మం జూరీ ప్రొసీడింగ్‌లు అందజేసి, చేతు లు దులుపె కోకుండా, నిధులు విడుదల చేయించి చిత్తశుద్ధిని చాటాలని సూచించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సంగి ఆనంద్, మం డల అధ్యక్షుడు బోగ రమేశ్, ఉపా ధ్యక్ష డు కంది తిరుపతి, నాయకులు సంగి శేఖర్, గుండారపు రాజశేఖర్, సిరికొండ అశోక్‌చారి పాల్గొన్నారు.

అన్నివర్గాల సంక్షేమానికి కృషి
కోరుట్ల, సెప్టెంబర్ 22: అన్ని వర్గాలతోపాటు ముస్లీం మైనార్టీవర్గాల సంక్షేమంకోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేసిందని కోరుట్ల తాజామాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం కోరుట్ల పట్టణంలోని 11మసీద్‌ల మరమ్మతులకు రూ. 69 లక్షల 50 వేల చెక్కులను తాజామాజీ ఎమ్మెల్యే కే. విద్యాసాగర్‌రావు అందించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం ఏ గఫార్, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అన్నం అనిల్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, పుప్పాల ప్రభాకర్, శ్రీనివాస్, వైస్ చైర్మన్ రఫియొద్దీన్, పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, డాక్టర్ వై. స్వీతి అనూఫ్, ముస్లీం మైనార్టీ నాయకులు, టీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌నే గెలిపించాలనుకొంటున్నారు
ముస్తాబాద్, సెప్టెంబర్ 22: ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే గెలిపించాలనుకొంటున్నారని ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ చెప్పా రు. ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 60ఏళ్లలో సాధించలేనిది తెలంగాణ ప్రభుత్వ వచ్చాక సాధించామన్నారు. నాలుగున్నర ఏళ్ల పాలన గర్వించ దగ్గట్లుగా జరిగిందని, అవినీతి లేని పాలన సాగిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చామని, చెప్పనివీ కూడ చేశామన్నారు. ప్రాజెక్టుల్ని అడ్డుకోడానికై కాంగ్రెస్ కుటిల రాజకీయం చేస్తున్నదని, తెలంగాణ యావత్తు టీఆర్‌ఎస్ పార్టీనే పెద్ద ఎత్తున గెలిపించాలని అనుకొంటున్నారని స్పష్టం చేశారు.