కరీంనగర్

80 లక్షల మంది ఉపాధికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 22: ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలకు అనుమతించేలా కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ప్రజల ప్రాణాలకు ప్ర మాదం, 80 లక్షల మంది ఉద్యోగుల జీవనోపాధికి విఘాతం కలుగనున్న నేపథ్యంలోనే ప్రయత్నాల నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈనెల 28న మెడికల్ షాప్‌లను బంద్ పాటించనున్నట్లు కెమిస్ట్,డ్రగ్గిస్ట్ జిల్లా అధ్యక్షుడు గాలిపెల్లి నరసయ్య తెలిపారు. శనివారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ఆల్‌ఇండియా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు జిల్లా స్థాయి మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరసయ్య మాట్లాడుతూ ఆల్‌లైన్‌లో ఔషధ విక్రయాలకు అనుమతిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఔషధ నియంత్రణ చట్టానికి చేయబోయే సవరణలకు నిరసగా దేశవ్యాప్తంగా ఈనెల 28న మెడికల్ షాప్‌ల బంద్ పాటించాలని తీర్మాణించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఔషధాల(మందుల) క్రయవిక్రయాల వల్ల నాణ్యతతో కూడిన మందులు లభిస్తాయనే భరోసా కేంద్ర ప్రభుత్వం కల్పించగలదా..? అని ఆయన ప్రశ్నించారు. మందులు ఒకటికి బదులు మరొకటి ఇచ్చే అవకాశాలు ఉన్నాయ ని ఇలాంటి పరిస్థితుల్లో మందులు వాడితే మనిషి ప్రాణాలలకే ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదన్నారు. మందులకు ఉన్న పేర్లలో ఒక అక్షరం తేడాతో కొనుగోలు చేసి వాటిని వాడితే ప్రజలకు సైడ్ ఎఫెక్ట్‌తోపాటు ఒక్కోసారి ప్రాణాలు గాలిలో కలిసి పోయే ప్రమాదం లేకపోలేదన్నారు. ఆన్‌లైన్‌లో మందుల క్రయవిక్రయాలతో యువతపై చెడు ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణాధార, అత్యవసర మందులు దొరకడం ప్రశ్నార్థకంగా మారుతుందని మెడికల్ షాప్‌ల వ్యాపారులు ఉన్న ఎనిమిది లక్షల మంది కెమిస్ట్‌లు, వారిపై పడ్డ దాదాపు 80లక్షల మంది ఉద్యోగుల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని జిల్లా అధ్యక్షుడు గాలిపెల్లి నరసయ్య వెల్లడించారు.

సుల్తానాబాద్‌లో సర్వాయ్ పాపన్న విగ్రహం ధ్వంసం
* భగ్గుమన్న బీసీలు...రాజీవ్ రహదారిపై రాస్తారోకో
సుల్తానాబాద్, సెప్టెంబర్ 22: సుల్తానాబాద్ పట్టణంలోని పాత జెండా వద్ద ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసుకున్న సర్థార్ సర్వాయ్ పాపన్న విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో బీసీ సంఘాల నాయకులు భగ్గుమన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రాజీవ్ రహాదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. విగ్రహాన్ని ద్వంసం చేసిన వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని నేతలు చేసిన నినాదాలు హోరెత్తాయి. దీంతో ఇరువైపులా కొంతసేపు వాహనాల రాకపోకలు అంతరాయం కలిగింది. స్థానిక ఎస్సై రాజేశ్ ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి రాస్తారోకోను విరమింపజేశారు. విగ్రహాన్ని స్థానిక సీఐ అ డ్లూరి రాములు, ఎస్సై రాజేశ్ సందర్శించారు. సర్దార్ సర్వాయ్ పాపన్న సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్, నాయకులు ముత్యం రమేష్, వేగోలం అబ్బయ్య మాట్లాడుతూ సర్దార్ సర్వాయ్ పాపన్న విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికి పంద ల చర్యని వారు ఆరోపించారు. అగ్రవర్ణాలు ఓర్వలేకనే విగ్రహాన్ని ద్వంసం చేయడం సరైందని కాదని, మహానీయుల విగ్రహాలను ధ్వంసం చేసినవా రు ఎంతటి వారైనా క్షమించేది లేదని హెచ్చరించారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే బీసీ నేత బిరదు రాజమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు వెంటనే స్పందిం చి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని బీసీ సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు.
కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మంద శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్, బోంగాని అనిల్, మధూకర్, పెద్ద ఎత్తున గౌడ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.