కరీంనగర్

సామాజిక తెలంగాణ కోసమే కళాకారుల ధూం..ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 22: రాష్ట్రం దొరలపాలనలో దోపిడీకి గురువుతున్న నేపథ్యంలో సామాజిక తెలంగాణ సాధన కోసమే మరోసారి కళాకారులు గజ్జె కట్టి గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్ గాదె ఇన్న య్య అన్నారు. ఈక్రమంలోనే వేలాది మంది కళాకారులు తమ ఆటపాటలతో ప్రజలను మరోసారి చైతన్యపర్చేందుకు నడుం బిగించి, నవ తెలంగాణలో ‘్ధం.. ధాం’గా ముం దుకు సాగనున్నారని వెల్లడించారు. శనివారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో సరికొత్త ఆశయాలతో తెలంగాణ ప్రజానీకాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని భావించిన రాష్ట్రప్రభుత్వం కేవలం కొన్ని వర్గాల చేతుల్లో బందీగా మారి, బడుగు, బలహీన వర్గాల బతుకులు చిద్రం చేస్తుందని ఆరోపించారు. సుదీర్ఘకాలంగా కొనసాగిన ఉద్యమంలో రాష్ట్రం కోసం తమ ప్రాణాలనే తృణప్రాయంగా త్యజించిన వేలాది మంది అమరుల ఆశయాలను అటకెక్కించిన ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు కళాకారులు అక్టోబర్ 1న గర్జించేందుకు ఉద్యుక్తులవుతున్నారని వివరించారు. ధూం.. ధాం నిర్వాహకుడు, తెలంగాణ జన సమితి సాంస్కృతిక విభాగం కన్వీనర్ నేర్నా ల కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడేందుకు మరోసారి తెలంగాణలో పాట తన ధిక్కార స్వరాన్ని వినిపించబోతుందన్నారు. నగరంలోని సర్కస్ మైదానంలో అక్టోబర్ 1న నిర్వహించే ధూం.. ధాంలో పాల్గొని, ఉద్యమ ఆ కాంక్షను ప్రకటిస్తారని వెల్లడించారు. కమాన్ నుంచి సర్కస్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, సా యంత్రం 5 గంటలకు కార్యక్రమం ఆరంభించనున్నట్లు తెలిపారు. ఆటపాటలోప్రముఖ కళాకారులు ఏపూరి సోమన్న, దరువు ఎల్లన్న, అంజన్న, రమాదేవి, వరంగల్ రవి, జనగళం రామలింగం, బుల్లెట్ వెంకన్న, ఓ యూ జేఏసీ నేతలు, విద్యార్థులు, తదితరులు పాల్గొననున్నట్లు చెప్పారు. సమావేశంలో టీజెఎస్ జిల్లా కన్వీనర్ నరహరి జగ్గారెడ్డి, నేతలు రొంటాల కేశవరెడ్డి, నరేందర్‌రెడ్డి, మొగురం రమేశ్, కనకం కుమారస్వామి, మహిపాల్ రెడ్డి, మార్వాడి సుదర్శన్, రజని, మాధవి, సుజాత, సాగర్, శ్యాంతో పాటు పలువురు పాల్గొన్నారు.

అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలి
ధర్మపురి, సెప్టెంబర్ 22: ఆదివారం నాటి వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సింధు శర్మ ఆదేశించారు. జగిత్యాల ఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రప్రథమంగా శనివారం ధర్మపురి క్షేత్ర సందర్శనలో పాల్గొన్నారు. ప్రధానంగా గణేశ విగ్రహాల ఊరేగింపువెళ్ళే నంది విగహ్ర కూడ లి నుండి దేవస్థానం, గోదావరి ప్రధాన రహదారిని పరిశీలించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలపై సమీక్షించారు. వివిధ ప్రదేశాలలో రూట్లు, రోడ్ల ద్వా రా ఊరేగింపు, నిమజ్జన స్థల పరిశీలనలు గావించి, అవసరమైన సూచనలు చేశారు. శుక్రవారం భారీ వర్షం కురిసినందున నది, తదితర స్థలాలలో పరిస్థితులను పరిశీలించారు. ఏఏ ప్రదేశాల నుండి పెద్దా, చిన్నా గణపతులు ఏ రూ టులో వస్తాయని, గతంలో ఏవైనా పొరపాట్లు చోటుచేసుకున్నాయా అని అడి గి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింధుశర్మ మాట్లాడుతూ నిమజ్జనానికి సమయ పాలన పాటించేలా చూడాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు వహించాలని, నది లోపలికి వెళ్ళకుండా చర్యలు గైకొనాలని సూచించారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐ విద్యాసాగర్, ఎస్‌ఐ అంజ య్య, ధర్మపురి మున్సిపల్ కమిషనర్, తహశీల్‌దార్ నవీన్ కుమార్, మేనేజర్ చంద్రశేఖర్, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, నేతలు సంగి శేఖర్, మురికి శ్రీనివాస్, అశోక్, రవి, పోలీసు సిబ్బంది వెంట ఉన్నారు. అనంతరం రాయపట్నం వెళ్లి, గోదావరి వద్ద స్థల పరిశీలన గావించారు.

ఆత్మవిశ్వాసంతోనే అఖండ విజయం
* ప్రజాకవి సత్యం గౌడ్
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 22: నేటి పోటీయుగంలో యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అఖండ విజయం సాధించటం తథ్యమని ప్రజాకవి, మానవ విలువల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల సత్యంగౌడ్ అన్నా రు. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పలు పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శనివారం నగరంలో ఆయన మానసిక ప్రశాంతత, పట్టుదలతోవిజయం, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సా ధించేందుకు ఎన్ని అవరోధాలెదురైనా వెనుకడుగేయకుండా, పట్టుదలతో సాధించాలన్నారు. క్రమశిక్షణ, ఏకాగ్రత పెంపొందించుకుంటే ఎంతటి కఠిన పాఠ్యాంశాలైనా అభ్యాసనం చేయవచ్చని, ఇందుకోసం నిత్యం సమయ సారిణి పాటించాలని సూచించారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.