కరీంనగర్

కాంగ్రెస్ మేనిఫెస్టోపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ రూపొందించిన మ్యానిపెస్టోపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని కాంగ్రెస్ అభిమానులు వెల్లడించారు. శనివారం మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో పర్యటించి కాంగ్రెస్ రూపొందించిన మ్యానిపెస్టోపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరాముల గంగాధర్,గర్వందుల నరేష్‌గౌడ్, గంగం మహేష్, రవీందర్‌రెడ్డి, మల్లారెడ్డి, హరీష్ , తదితరులు పాల్గొన్నారు.

పెన్షదారుల సమస్యల పరిష్కారానికి కృషి
* జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్
జగిత్యాల, సెప్టెంబర్ 22: పెన్షన్‌దారుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ పెన్షనర్స్ సెంటర్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో కృషి చేస్తున్న పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రమైన జగిత్యాల టీఎన్జీవోల భవన ఆవరణలో జిల్లా స్థాయి పెన్షన్‌దారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందే పింఛన్ మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి వినతి పత్రం అందజేశామన్నారు. మధ్యంతర భృతి వెంటనే ఇవ్వాలని, 70 సంవత్సరాలుపైబడిన పెన్షనర్లకు అదనపు పింఛన్లు చెల్లించాలని, తెలంగాణ ప్రోత్సహకాన్ని అందించాలని, ఉద్యోగ విరమణ గ్రాట్యూటీ రూ. 12లక్షల నుండి రూ. 16లక్షలకు పెంచాలని, ఆదాయ పన్ను నుంచి మినహాయించాల ని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ద్వారా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జెట్లిని కోరామన్నారు. గ్రంథాలయ, వ్యవసాయ మార్కెట్ కమిటీల కేంద్ర సహాకార సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, కోశాధికారి విశ్వనాథం, రఘుపతి, విద్యాసాగర్,ఎండి యాకూబ్, ప్రకాష్, సత్యనారాయణ, రాంచందర్‌రావు, స్వామి, శివానందం, సైఫొద్దీన్, గంగాధర్, ప్రసాద్, నారాయణ, నర్సయ్య, హుస్సేన్, రజాక్, విఠల్, ప్రేమ్‌సాగర్, రాజ్‌మోహన్, తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు
* వీధివీధినా మిన్నంటిన సంబురాలు
కరీంనగర్, సెప్టెంబర్ 22: నిర్మలమైన వాతావరణం..నింగిన మేఘాల సమావేశం..్భక్తిపారవశ్యంతో భక్తుల నీరాజనాల మధ్య ఆ బొజ్జ గణపయ్యలు ఇక సెలవంటూ శనివారం గంగమ్మ ఓడిలోకి చేరారు. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలందుకున్న గణనాథులు వేషధారణలు, బాజాభజంత్రీలు, చప్పట్లు, తాళాల నడుమ భక్తజనుల భజనల మధ్య నిమజనోత్సవానికి అట్టహాసంగా తరలారు. ఉదయం నుంచే నిర్వాహకులు గణేష్‌లను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా, అందంగా అలంకరించిన వివిధ వాహనాలపై గణనాథులను పెట్టి నిమజ్జనానికి తరలించారు. మధ్యాహ్నం నుంచి నిమజ్జన శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు దగదగ మెరిసే విద్యుత్ కాంతులతో, భక్తుల నృత్యాలతో, గణపతి బప్ప మోరియా..జై బోలో గణేష్ మహారాజ్‌కీ జై అంటూ భక్తజనుల స్మరణలతో వైభవోపేతంగా శోభాయాత్ర కొనసాగింది. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌తోపాటు పరిసర గ్రామాల్లో సుమారు 1500 దాకా గణపతులను నెలకొల్పగా, ఈ గణనాథులకు స్వాగతం పలికేందుకు నగరంలోని ప్రముఖ వ్యాపార కూడలి టవర్ సర్కిల్‌లో గణేష్ ఉత్సవ సమితి, విశ్వహిందు పరిషత్ ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు చేరిన తొలి గణనాథుడికి కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మేయర్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు పూజలు చేసి నిమజ్జన వేడుకలను ప్రారంభించారు. శోభాయమానంగా సాగిన గణపయ్యల శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో టవర్ సర్కిల్‌కు చేరుకున్నారు. దీంతో టవర్ సర్కిల్‌తోపాటు పరిసరాలన్ని జన సందడితో కిక్కిరిసిపోయాయి. శోభాయాత్రగా తరలివెళ్లిన గణనాథులు మానకొండూరు చెరువులో, చింతకుంట కాలువలో, కొత్తపల్లి చెరువులో ఆ గంగమ్మ ఓడిలోకి చేరాయి. తమను సల్లంగచూడు తండ్రి అంటూ భక్తజనం ఆ వినాయకుడికి వీడ్కోలు పలుకగా, అదేతీరుగా ఆ గణనాథుడు భక్తులను ఆశీర్వదిస్తూ ఇక సెవలంటూ వీడ్కోలు చెప్పాడు. ఆదివారం వేకువజాము వరకు గణనాథుల నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, జమ్మికుంట తదితర పట్టణాల్లో నిమజ్జన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. జమ్మికుంటలో అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడిని చెరువులో వేసేందుకు క్రేన్‌పై ఉన్న నలుగురు ఆ క్రేన్ వైర్ తెగిపోయి చెరువులో పడిపోయారు. నలుగురికి తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. పలు ప్రాంతాల్లో దేవుడి లడ్డు కోసం వేలం పాటలు నిర్వహించగా, కొందరు ఉత్సాహంగా పాల్గొని లడ్డును కైవసం చేసుకున్నారు. కాగా, నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. భారీ బందోబస్తు చర్యలు చేపట్టగా, సీసీ కెమెరాలను అనుసంధానం చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా శోభయాత్రను పోలీసు అధికారులు పర్యవేక్షించారు. పలు దారుల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. వరంగల్ ఐజీ నాగిరెడ్డి కరీంనగర్‌లో బందోబస్తు చర్యలను పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్, నిమజ్జన ప్రాంతాలను సందర్శించారు. ఆయన వెంట సీపీ కమలాసన్‌రెడ్డి ఉన్నారు. వీహెచ్‌పి నేతలు రాజేందర్ రెడ్డి, శ్రీహరిరెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్‌లతోపాటు పలువురు ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తానికి జమ్మికుం ట ఘటన మినహా ఎక్కడా ఎలాంటి అపశృతులు దొర్లకుండా ప్రశాంతంగా, సజావుగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ముగిసింది.