కరీంనగర్

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 23: జగిత్యా ల జిల్లావ్యాప్తంగా గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించుకోండీ.. ప్రశాంతతను పరిరక్షించండీ... శోభాయమానంగా శోభయాత్ర తీయండీ.. కాని చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవాలని చూసినా ఉపేక్షించేది లేదని ఐ జీపీ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రమైన జగిత్యాలో వినాయక శోభయాత్ర వెళ్లే మార్గాలను, నిమజ్జన ం చేసే ప్రాంతాలను, భద్రత కోసం అ మర్చిన సీసీ కెమెరాల పనితీరును జి ల్లా ఎస్పీ సిహెచ్.సింధూశర్మ, డీఎస్పీ ఎం.వెంకటరమణలతో కలిసి పరిశీలించారు. ఐజీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన జగిత్యాలతోపాటు కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలు, పలు ప్రాంతాల్లో జరుగనున్న వినాయక ని మజ్జనాల గురించి ఆరాతీశామని, గ ణేశ్ నిమజ్జనానికి పకడ్భందీ చర్యలు చేపట్టామని అందరూ ప్రశాంతంగా నిమజ్జనానికి సహకరించాలన్నారు. పోలీసులకు పలు సూచనలు చేశామ ని, సూచనలకనుగుణంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు. పో లీస్‌శాఖ ఇచ్చే సూచనలు నిర్వాహకు లు తూచా తప్పకుండా పాటించి ప్ర శాంత వాతావరణంలో నిమజ్జనం చే సుకునేలా సంపూర్ణ సహకారాన్ని అ ందించాలని కోరారు. ఇప్పటికే గణేష్ మండలాలను జియోటాగింగ్‌ను పూ ర్తిచేశామని, అధికారులకు ఎప్పటికప పుడు శోభయాత్ర, నిమజ్జనం సమాచా రం అందించేలా ప్రత్యేక సెల్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో పనిచేస్తుందన్నారు. నిమజ్జనమంతా ప్రశాంత వా తావరణంలో పూర్తయ్యేలా భారీ భ ద్రతపరమైన చర్యలు చేపట్టామని, అ వసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ను ఏర్పాటుచేశామని, స్థానిక గజ ఈ తగాళ్లలను నిమజ్జనం ప్రాంతాల్లో అ ందుబాటులో ఉంచామన్నారు. పోలీ స్‌వారిచే నిర్థేశించిన శోభయాత్ర నిర్వహించనున్న రహదారిలో ఇతర శాఖ ల సమన్వయంతో ఎలాంటి అవాంతరాలు తల్తెకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చట్టవ్యతిరేక విధానా లకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ మతాల పెద్దలతో శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఏమైనా సమస్యలుంటే పో లీసుల దృష్టికి తీసుకురావాలని, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ నిమజ్జనానికి వినాయకులను ప్రశాంత వాతావరణంలో తీసుకెళ్లాలని ఇందు కు ఇరుమతాల పెద్దలు పోలీసులకు సహకరించాలని ఐజీపీ నాగిరెడ్డి కో రారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిహెచ్.సింధూశర్మ, జగిత్యాల డీఎస్పీ ఎం.వెంకటరమణ, ప్రతాప్, ఎస్‌బీఐ రాజశేఖరరాజు, సీఐలు ఆర్.ప్రకాష్, రాజేష్, ఆర్‌ఐ, వివిధ పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు.

సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి
పట్టాలు జారీఅయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం
గోదావరిఖని, సెప్టెంబర్ 23: సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వా రికి పట్టాలు జారీఅయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ చైర్మన్, తా జా మాజీ ఎమ్మెల్యే సొమారపు సత్యనారాయణ, రామగుండం నగర పా లక సంస్థ మేయర్ చిట్టూరి రాజమణి వెల్లడించారు. ఆదివారం ఆర్‌సిఓఎ క్ల బ్‌లో దాదాపు 1600 మందికి గతం లో సింగరేణి స్థలాలు క్రమబద్ధీకరణ తదుపరి జారీచేయగా మిగిలిపోయి న పట్టాలను పంపిణీచేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారు మాట్లాడుతూ ఫిబ్రవరి 16, 2009లో కొంతమంది వివిధ కా రణాల వలన పట్టాలు తీసుకోలేకపోయారన్నారు. పట్టాల కొరకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ గత కొనే్నళ్లుగా తిరుగుతున్న నేపథ్యంలో చొరవ తీ సుకొని పునఃసర్వే చేయించి పట్టాలు జారీచేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున నట్లు పేర్కొన్నారు. ఇంకా మిగిలిఉన్న స్థలాలను సంబంధించి పట్టాలను కూడా జారీచేసేందుకు ప్రభుత్వం చర యలు తీసుకుంటుందని, ఈనెల 25న ఓటర్ల నమోదు ప్రక్రియ గడువు ముగిసినతర్వాత 25 ప్రత్యేక బృందాలతో ఈ స్థలాల్లో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మే యర్ సత్యప్రసాద్, కమీషనర్ భువనగిరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.