కరీంనగర్

ధర్మపురి క్షేత్రంలో భక్తజన సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, సెప్టెంబర్ 24: ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురిలో నిర్వహించిన గణేశ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి అత్యధిక సం ఖ్యలో భక్తులు, యాత్రికులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. దీనిలో భా గంగా గోదావరి నదిలో స్నానాలు ఆచరించగా, చాలామంది పౌర్ణమి స్నానాలకై బస చేశారు. భాద్రపద పౌర్ణమి పర్వదిన సందర్భంగా సోమవారం ఉదయాత్పూర్వం నుంచే బస్సులు, ప్రైవేటు వాహనాలలో విచ్చేసిన భక్తులు గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, మహా సంకల్పాది పూజలొనరించి, గోదావరి మాతను అర్చించారు. భక్తి ప్రపత్తులతో, మహాసంకల్పాలు, దాన ధర్మాది సత్కర్మలను ఆచరించారు. నదీ పౌరోహితుల ఆధ్వర్యంలో తమ గోత్రనామాదులతో ప్రత్యేక పూజలు, మహా సంకల్పాదులను వేదోక్త సంప్రదాయాచరణ ప్రకా రం ఆచరించారు. అనంతరం దైవదర్శనాల కోసం ప్రధానాలయాలకు వెళ్లి ప్ర త్యేక గోత్రనామయుక్త పూజలను గావించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలోని ప్రధానాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు గావించారు. దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మకర్తలు, సూపరింటెండెంట్ కిరణ్ ఆధ్వర్యంలో ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, ముత్యాల శర్మ, అర్చక పురోహితులు బొజ్జా సంతోషశర్మ, సంపత్ కుమార శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, వివిధ ఆలయాల అర్చకులు ప్రత్యేక సంప్రదాయక పూజలు, అర్చనలు, నిత్య కల్యాణం, హోమాది కార్యక్రమాలను నిర్వహించారు.