కరీంనగర్

రసమయిని మరోసారి గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, సెప్టెంబర్ 24: నాడు ప్రజా గాయకుడిగా తెలంగాణా ఉద్యమ పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టి గోసి, గొంగలితో గల్లీ నుంచి ఢిల్లీదాక తన ఆట పాటలతో ప్రజలను చైతన్య వంతులను చేసి, నేడు ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నం రసమయి బాలకిషన్‌ను మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గార్డెన్‌లో తిమ్మాపూర్ మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో రసమయన్న వెంటే మేమంతా అంటూ దళిత సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అల్గునూర్ చౌరస్తా నుంచి గార్డెన్ వరకు డప్పు చప్పు ళ్ళు, కోలాటం నృత్యాలు, బాణసంచా పేలుస్తూ 2 వేల మంది భారీ ర్యాలీ నిర్వహించారు. అల్గునూర్ పూర్తిగా గులాబీ జెండాలతో రెపరెపలాడింది. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన రసమయి బాలకిషన్ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ప్రజాగాయకుడిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపుపొందాడని అన్నారు. రసమయి బాలకిషన్ లాంటి మంచి నాయకుడిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని రాజేందర్ కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ దళితులంతా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని స్పష్టం చేశారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 600 మంది దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఐదేళ్ల పాపపై అత్యాచారం యత్నం కేసులో..
* నిందితుడికి ఐదేళ్ల జైలు, రూ.5 వేలు జరిమానా
* తీర్పు చెప్పిన న్యాయమూర్తి
సిరిసిల్ల, సెప్టెంబర్ 24: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన నిందితుడు క్యారం కిషన్ (45)కు అయిదు సంవత్సరాలు జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు సెస్సన్స్ జడ్జి శ్రీనివాసు తీర్పు వెల్లడించారు. సోమవారం న్యాయమూర్తి ఈ తీర్పును వెలువరించారు. తంగళ్లపల్లి మండల కేంద్రం లో 2016 మార్చి 13న నిందితుడు కిషన్ అయిదేళ్ల పాపను చాక్లెట్ ఇస్తానని ఇంటి నుంచి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేస్తుండగా, బాధితురాలి సోదరి పాప కోసం వెళ్లగా జరిగిన ఉదంతం చూసి అరవడంతో ప్రజలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై సిరిసిల్ల సీఐ జీ.విజయకుమార్ కేసు నమోదు చేశారు. కోర్టు పీసీ విష్ణుమూర్తి సాక్ష్యాలను ప్రవేశ పెట్టడానికి కృషి చేసినట్టు తెలిపారు.
ఎన్నికలప్పుడు ఎందుకు వెళ్తారు?
హుస్నాబాద్, సెప్టెంబర్ 24: నూ తన రాష్ట్రంలో ప్రజలు తమ కష్టాలను ముఖ్యమంత్రికి చెప్పుకోవడానికి వస్తే ప్రజలను కలవని కేసీఆర్ ఎన్నికలప్పుడు వారి వద్దకు ఎందు కు వెళ్తారని సీపీఐ రాష్టక్రార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలో 5 ఏళ్ల పాలన కోసం కేసీఆర్‌కు ప్రజలు పరిపాలన అప్పగిస్తే వారి నమ్మకాన్ని తుంగలో తొక్కి ప్రభుత్వన్ని రద్దు చేసి ఎన్నికలను పోవడం చాలా బాధాకరమన్నారు. నీళ్లు నియామాకాలు,నిధులు పేరిట ఏర్పాటయిన ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట నిధులు దుర్వీనియోగం చేయడం జరుగుతుందని అరోపించారు. హుస్నాబాద్‌లో ప్రా జెక్టులు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీరీస్తామన్న కెసిఅర్ నేడు నిధులు నీళ్లులేవని ఎద్దెవ చేశారు. సీపీఐ కాలంలోనే హుస్నాబాద్‌లో డిగ్రీ కాలేజీ జానియర్ కాలేజీలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేశామన్నారు. టీ ఆర్‌ఎస్ పాలనలో ఆర్భాటాలు త ప్ప అభివృద్ధి లేదని ఆరోపించారు. నేతలు శ్రీనివాస్‌రావు, బోయిని అశోక్, వెంకటరెడ్డి, 7 మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు.