కరీంనగర్

రైతుల సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, సెప్టెంబర్ 24: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నా రు. సోమవారం సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల సింగిల్‌విండో ఆధ్వర్యంలో కొదురుపాక గ్రామంలో ఇటీవల పది లక్షల రూపాయలతో నూతనంగా ని ర్మించిన 400 మెట్రిక్ టన్నుల గోదాములను కొండూరు, ఎమ్మె ల్సీ భానుప్రసాద రావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. స మావేశంలో వారు మాట్లాడుతూ కేసీఆర్ రైతులకు 24 గంటల వి ద్యుత్, సాగు, తాగునీరు అందించడంతో పాటు రైతు ఏదైనా కారణంతో మృతి చెందితే రైతుబంధు కింద ఐదు లక్షలు అందజేయడం గొప్ప విషయమన్నారు. సింగిల్‌విండో చైర్మన్ పదవీకాలం మరో నాలుగు నెలలు ఉన్నందున త్వరలోనే పెట్రోల్‌బంక్ నిర్మాణం చేపట్టి మళ్లీ భారీ సమావేశం నిర్వహించాలని సింగిల్‌విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావుకు వారు సూచించారు. చిన్నకల్వల సింగిల్‌విండో అభివృద్ధికి అహర్నిశలు శ్ర మించిన చైర్మన్ మోహన్ రావును రవీందర్ రావును ఘనంగా సన్మానించారు. జిల్లా సీఇఓ సత్యనారాయ ణ రావు, జిల్లా సహకార శాఖ అధికారి చంద్రప్రకాశ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కోట రాంరెడ్డి, సింగిల్‌విం డో చైర్మన్లు మోహన్ రావు, శ్రీగిరి శ్రీనివాస్, మీస అర్జున్ రావు, ఎం పీటీసీలు ఉత్తమ కుమారి, బుర్ర వౌనిక, శ్రీనివాస్, మీస అర్జున్ రావు, పల్లా సురేష్ పాల్గొన్నారు.
ఓటు హక్కు వజ్రాయుధం
* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 24: రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం నగరంలోని శుభం గార్డెన్‌తో పాటు మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటర్ల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో తమకు నచ్చిన పాలకులను ఎన్నుకునేందుకు ఓటుహక్కు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేటితో ఈ నమోదు ముగుస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీ ఈవో తెంగాణ. ఇన్ వెబ్‌సైట్ నుంచి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల ఎదుట ఏర్పా టు చేసిన ఓటరు అవగాహన కేంద్రా న్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రత్యేక సహాక కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెటింగ్ శాఖ ఉపసంచాలకులు పద్మావతి, డీఎస్‌డీవో అశోక్‌కుమార్, సం బంధిత కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

రాజన్న సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ చైర్మన్

వేములవాడ, సెప్టెంబర్ 24: వేము లవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో సోమవారం దర్శించుకున్నారు. దీనిలో భాగంగా ఆలయ సి బ్బంది స్వాగతం పలికారు. అనంతరం అంతరాయంలోని స్వామివార్లకు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తరించారు. కల్యాణ మండపంలో అర్చకులు ఆయన్ని ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో రద్దీ
రాజన్న ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొన్నది. వందలాది మంది భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు.