కరీంనగర్

నిరసనలు.. నిలదీతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 14: ముం దస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీ ల కన్నా ముందే తమ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారానికి దించిన అధికార పార్టీ తెరాస క్షేత్రస్థాయిలో విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటుంది. రెండు మాసాల ముందుగానే ఆ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన తాజామాజీ ఎమ్మెల్యేలకు పలుచోట్ల ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో పల్లెల్లోకి వెళ్తుండగా వా రికి నిరసనలు, నిలదీతలు స్వాగతం పలుకుతున్నాయి. మరోవైపు స్వపక్షంలో సైతం కొంతమంది విపక్షంగా మారి అసమ్మతి రాగం ఆలపిస్తుండగా అధికార పార్టీ అభ్యర్థుల్లో ఇప్పటినుంచే ఆందోళన మొదలైంది. మొన్నటికి మొన్న ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో తెరా స అభ్యర్థిగా బరిలో నిలిచిన తాజామాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు కు, నిన్న వేములవాడ నియోజక వర్గంలో తెరాస అభ్యర్థి చెన్నమనేని రమేష్‌బాబుకు, జగిత్యాల అభ్యర్థి డా క్టర్ సంజయ్‌కుమార్‌కు, తాజాగా కోరుట్ల అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావులకు ప్రచారాల్లో చేదు అనుభవాలు ఎదురవుతుండగా, ముందుకెళ్ళేదెలా అంటూ తలలు పట్టుకుంటునా నరు. గత ఎన్నికల్లో స్థానికంగా తాము ఇచ్చిన హామీలే ప్రస్తుతం తమ మెడకు చుట్టుకుంటుండటంతో గట్టెక్కేదెలా.. అంటూ తమ చూపును అ ధిష్టానం వైపు మరల్చారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఆ తరువాత మొఖం చాటేసిన సందర్భాలే వా రిని విపత్కర పరిస్ధితుల్లోకి నెట్టేస్తుండగా, గండం నుంచి బయటపడేందుకు శతవిధాల యత్నిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం, ప్రజా, రైతు సమస్యల పై పట్టింపులేని తనం, అతివిశ్వాసమే అధికార అభ్యర్థుల పీ కలమీదకు వస్తోందనే అభిప్రాయాలు రాజకీయ విశే్లషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకొచ్చిన 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైదం టూ, మీ ప్రకటన కాగితానికే పరిమి తం చేశారంటూ కోరుట్ల సెగ్మెంట్‌లోని వేంపేటలో ఎన్నికల ప్రచారానికి వె ళ్ళిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల వి ద్యాసాగర్‌రావుకు రైతులు, గ్రామస్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవటం హామీల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తో ంది. ఈ సంఘటనతో టీఆర్‌ఎస్ నా యకుల నోటిలో చక్కెర రైతులు చేదుగుళికలు వేసినట్లైంది. గ్రామాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ప్రచారం నిర్వహించేలా పార్టీ అధిష్టానం తె రాస అభ్యర్థులకు సూచనలు చేయగా తగు జాగ్రత్తలు తీసుకొనే చర్యల్లో ఆయా సెగ్మెంట్ల అభ్యర్థులు నిమగ్నం కావటం గమనార్హం.