కరీంనగర్

తెలుగుభాషా పరిరక్షణే ప్రథమ కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-ముంబయి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు సంకు సుధాకర్
కరీంనగర్, అక్టోబర్ 16: మహారాష్టల్రో తెలుగుభాష సాహితీ కళల పరిరక్షణే తమ ప్రథమ కర్తవ్యమని అందుకోసం నిరంతరం కృషి చేయడమే కాకుండా ఆయా రంగాల్లో విశిష్టమైన సేవలు అందించే సంస్థలు, వ్యక్తులకు అండదండలు అందిస్తామని ముంబాయి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు సంకు సుధాకర్ అన్నారు. పూణే తెలుగు సాహిత్య పీఠం, తెలుగు రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సాహితీ సంస్థలు ఎన్నిక ఆవిర్భవించినా అవి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయన్నారు. తెలుగుభాష ముఖ్యంగా తెలంగాణ యాస, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ముంబాయిలో అనేక సంఘాలు ఆవిర్భవిస్తుండటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న తెలంగాణ సాహితీ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్దారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగుభాషకున్న ప్రాధాన్యత అమోఘమని, ఏ దేశమేగినా..ఎందుకాలిడినా..పొగడా నీ భాష నిండు గౌరవాన్ని అన్నట్లు బతుకుదెవురు కోసం పొట్టచేత పట్టుకొని విభిన్న భాషా సంస్కృతిక కలయికకు వేదికమైన ముంబాయిలో తెలుగువారంతా ఏకమై తమ భాషపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడం అభినందనీయన్నారు. ఈ సందర్భంగా మహారాష్టక్రు చెందిన 40మంది తెలుగుకవుల సంకలనం మరో అడుగును ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు సాహితీ వేత్తలను ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో తెలుగు రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఏర్పాటును ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా రూపొందించిన లోగోను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో తెలుగుకళా సమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి, రాష్ట్రేతర తెలుగుసమైక్య అధ్యక్షుడు పీవీ పీసీ ప్రసాద్, పూణే ఆంధ్ర సంఘం అధ్యక్షుడులు శేషగిరిరావు, తెలుగు సాహిత్య పీఠం అధ్యక్షులు టీవీ శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి తరుగ జయశ్యామల, త్వమ్ అధ్యక్షులు రవినాచవాన్, ప్రధాన కార్యదర్శి సంఘ్నవేణి రవీంద్ర తదితరులతోపాటు 500మంది కవులు, రచయితలు పాల్గొన్నారు.

నగరవాసులకు అమ్మవారి ఆశీస్సులు
-మేయర్ రవీందర్‌సింగ్
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 16: అమ్మల గన్న అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు నగరవాసులందరికీ అందాలని మేయర్ రవీందర్‌సింగ్ ఆకాంక్షించారు. మంగళవారం నగరంలోని పలు మండపాల్లో ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక 24వ డివిజన్‌లోని మంటపాన్ని సందర్శించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవీ ఉత్సవాలతో పాటు బతుకమ్మ, దసరా వేడుకలకు కూడా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
మేనిఫెస్టోపై సంబురాలు
బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ఎన్నికల్లో ముందుకు సాగుతున్న తెరాస ప్రభుత్వానికి మరో అవకాశమివ్వాలని మేయర్ రవీందర్‌సింగ్ కోరారు. ఆపార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అధినేత కేసీఆర్ హైద్రాబాద్‌లోవిడుదల చేసిన అనంతరం నగరంలోని తెలంగాణ చౌక్‌లో తెరాస నాయకులు సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈసారి మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండే అనేక అంశాలు చేర్చినట్లు వెల్లడించారు. ఆసరా పెన్షన్‌లో భాగంగా వెయ్యి పెన్షన్, రెండు వేలకు పెంచటం, వికలాంగులకు మూడువేలకు పెంచుతూ, అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించిందని ఆనందం వ్యక్తం చేశారు. నిరుద్యోగులని దృష్టిలో పెట్టుకుని రూ.3016ల నిరుద్యోగ భృతి ప్రకటించి, సంచలనమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. రైతుల కోసం ఏడాదికి రూ.8వేల పెట్టుబడి రాయితీని రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, వైశ్యుల కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రకటించటం గొప్ప నిర్ణయమన్నారు.

స్నేహితుడిని పొడిచి చంపిన డిగ్రీ విద్యార్థి
జగిత్యాల రూరల్, అక్టోబర్ 16: జగిత్యాల మండలం తాటిపల్లిలో సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన డిగ్రీ విద్యార్థి హత్య గ్రామంలో కలకలం రేపింది. జగిత్యాల రూరల్ ఎస్సై చిర్ర సతీష్ కథనం ప్రకారం సోమావారం అర్ధరాత్రి 12 గంటలకు సాధినేని నవీన్ అనే డిగ్రీ విద్యార్థిని తోటి డిగ్రీ విద్యార్థి బొల్లిషెట్టి శ్రవణ్ పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఎస్సై వెల్లడించారు. సాధినేని నవీన్ తండ్రి రాజరెడ్డి పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా ఇరువురు స్నేహితులు జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. నవీన్ మృతితో వారి కుటుంబ సభ్యుల రోదన గ్రామస్తులను కలిచివేసింది. తోటి స్నేహితుడే హత్య చేయడం పట్ల గ్రామస్తులు పలువిదాలుగా చర్చించుకుంటున్నారు. సంఘటన స్ధలాన్ని డీఎస్పీ వెంకటరమణ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.