కరీంనగర్

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 16: రాష్ట్రంలో డిసెంబర్ 7న జరుగనున్న శాసనసభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ అన్నారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నామినేషన్ల స్వీకరణ, స్క్రూటిని తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం కోసం పోటీలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇచ్చే పేయిడ్ న్యూస్ (చెల్లింపు వార్తల)పై దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. ఫెయిడ్ న్యూస్‌గా గుర్తించిన ఖర్చులను సంబంధిత అభ్యర్థుల ఖాతాలో జమ చేయాలని అన్నారు. నవంబర్‌లో విడుదలయ్యే ఎన్నికల షెడ్యూల్ మొదలుకొని ఫలితాలు విడుదలయ్యే వరకు ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు, స్క్రూటిని, నామినేషన్ల ఉపసంహరణ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులకు పూర్తి అధికారం ఉంటుందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళినని తూచ తప్పకుండా పాటించాలని అన్నారు. పోస్టల్ బ్యాలట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసే మద్యం, డబ్బులను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు దృష్టి సారించేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పకడ్బంధీగా అమలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులకు ఎన్నికల నిర్వహణపై పలు ఆదేశాలు, సూచనలు, సలహాలు అందించి, పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రెయినీ కలెక్టర్ ప్రావీణ్య, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, రిటర్నింగ్ అధికారులు, జిల్లా పరిషత్ సిఇఓ వెంకటమాధవ రావు, కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ల అధికారులు ఆనంద్ కుమార్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకల్లో డీజే, డ్రోన్‌లు నిషేధం
* ఆజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యిలు తప్పవు *నగర పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్, అక్టోబర్ 16: తెలంగాణలో ఇంటింటా ధనిక,పేద తేడా లేకుండా ఆడపడుచులు ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో డీజేలు, డ్రోన్ కెమెరాలు వినియోగంపై నిషేధించినట్లు సీపీ విబి కమలాసన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని టవర్ సర్కిల్, మానేరు, గౌతమి నగర్, రామచంద్రాపూర్, సప్తగిరి కాలనీ, రాంనగర్, విద్యానగర్, మార్కుఫెడ్, కిసాన్‌నగర్ మొదలైన ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలను,గిద్దె పెరుమాళ్ళ ఆలయ ప్రాంగణంలో మార్కుఫెడ్‌లలో దసరా సందర్భంగా రావణ దహనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకుంటారని సీపీ కమలాసన్‌రెడ్డి మంగళవారం స్థానిక విలేఖరులకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటింటా ఆడపడుచులు జరుపుకునే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయం అన్నారు. కొంతమంది విపరీతమైన శబ్ధ కాలుష్యానికి కారణమైన డీజే సౌండ్ సిస్టాన్ని, తమ పలుకుబడి, ప్రాభవం కోసం వినియోగించే ప్రయత్నం చేస్తుంటారని, కరీంనగర్ పోలీస్ ప్రజలకు అసౌకర్యం, ఇబ్బంది డీజేలను గత రెండేళ్లుగా నిషేధించి, ప్రజల సహకారంతో, మద్ధతుతో ఆ నిషేధాన్ని అమలు పరుస్తున్నామన్నారు.బతుకమ్మ వేడుకలు, దసరా సందర్భంగా డీజే సీస్టం వినియోగించకుండా నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయన్నారు. అంతే కాక భద్రత పరమైన సమస్య తీవ్రంగా ఉండడం వల్ల డ్రోన్ కెమెరా వినియోగం కూడా నిషేధిస్తున్నామన్నారు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి డీజేలు, డ్రోన్ కెమెరాలను వినియోగించే ప్రయత్నం చేస్తే స్వాధీనం చేసుకోవడంతో పాటు, నిర్వాహకులు, యజమానులపై కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.