కరీంనగర్

పోలీస్ త్యాగాలతోనే సమాజంలో శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 21: ప్రజారక్ష ణ కోసం ప్రాణాలు లెక్కచేయకుండా విధినిర్వహణలో రేయింబవళ్ళు శ్ర మిస్తూ వీరోచిత పోరాటాల ఫలితంగానే సమాజంలో శాంతి నెలకొందని కరీంనగర్ జిల్లాకలెక్టర్ సర్ఫరాజ్ అ హ్మద్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కమీషనరేట్ కేంద్ర స్మృతి పరేడ్‌లో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ సర్ఫరాజ్ అ హ్మద్ మాట్లాడుతూ ప్రజల ధన, మా న, ప్రాణాల రక్షణ కోసం కుటుంబాల ను సైతం లెక్కచేయకుండా విధినిర్వహణ కొనసాగిస్తున్నారని,వారికి సహకారం అందించాల్సిన బాధ్యత సమాజంలోని అన్నివర్గాల ప్రజలపై ఉందన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉ ంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందనా నరు. కమీషనరేట్ పోలీస్ శాంతిభద్రతల పరిరక్షణకోసం చేపడుతున్న కా ర్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రజారక్షణ కోసం ప్రాణాలు తృణప్రాయంగా వదులుకున్న అమరవీరులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం అన్నా రు. పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు వృధాకావని, వారి ఆశయాల సాధన కోసం శక్తివంచన లే కుండా కృషిచేస్తున్నామన్నారు. తీవ్రవా ద, ఉగ్రవాద, మతోన్మాద శక్తులతో పో రాడుతూ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ నిరంతరం క ృషిచేస్తున్నారని, అన్నివర్గాల ప్రజలు తమవంతు సహకారం అందిస్తూ శాం తిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగస్వాములు కావాలని కమలాసన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గత సంవత్సర కాల ంలో దేశవ్యాప్తంగా వివిధ స్థాయిలకు చెందిన 414 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని చెప్పారు. స్మృతి పరేడ్‌లో పోలీస్ శోక్‌శస్త్ ద్వారా నివాళు అర్పించారు. పరేడ్‌కమాండర్‌గా ఆర్ ఐ మల్లేశం వ్యవహరించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఉగ్రవాద, తీవ్రవాద చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన వివిధ రక్షణ పోలీస్ బలగాలకు చె ందిన పోలీసుల పేర్లను అడిషనల్ డీ సీపీ (పరిపాలన) ఎస్.శ్రీనివాస్ చదివి వినిపించి నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొంది న విజేతలకు బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (లాఅండ్ ఆర్డర్) పి.సంజీవ్‌కుమార్, ఏసీపీలు పి.అశోక్, టి.ఉషారాణి, టి. కృపాకర్, వెంకటరమణారెడ్డి, శోభన్‌కుమార్, శ్యాంసుందర్, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, శాంతి, సంక్షేమ కమిటీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శా ఖలకు చెందిన అధికారులు, వివిధ వి భాగాలకు చెందిన పోలీసులు, స్వ చ్చంధ సంస్థలకు చెందిన ప్రతినిధు లు తదితరులు పాల్గొన్నారు.