కరీంనగర్

అమరులైన పోలీసుల జీవితాలను మార్గదర్శకంగా విధులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, అక్టోబర్ 21: ప్రజల సేవకు అమరులైన పోలీసుల జీవితాలను మార్గదర్శకంగా తీసుకొని విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని రామగుండం కమీషనరేట్‌లోని ఆర్ముడ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, అమరుల స్థూపం వద్ద కాగడా వెలిగించి, పుష్పగుచ్ఛం సమర్పించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం వంటి విచ్ఛిన్నకర శక్తుల తో నేరాలకు, ఘోరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసుల ఉద్యోగం కత్తి మీద సాములాగా ఎంతో ప్రమాదకరంగా పరిణమించిందని తెలిపారు. ఈ దశలో త్యాగాలకు భయపడకుండా వెనుకడుగు వేయకుండా రెట్టించిన సమరోత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. లడక్ ప్రాంతంలో హాట్ స్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై దాడి చేసి 10 మందిని హతమార్చిందని, అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బానిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందని తెలిపారు. త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, వారి యొక్క సమస్యలను అడిగి సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి సుదర్శన్ గౌడ్, మంచిర్యాల డిసిపి వేణుగోపాల్ రావు, అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్, అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ రవి కుమార్, ఎఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్, ఎసిపిలు రక్షిత కె మూర్తి, బాలు జాదవ్, హబీబ్ ఖాన్, గౌస్ బాబా, సి ఐలు, ఎస్ ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

చిల్లర రాజకీయాలు చేసింది మీరా... మేమా...?
* రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయికి కాంగ్రెస్ నాయకుల సవాల్
తిమ్మాపూర్, అక్టోబర్ 21: భారత దేశంలో 126 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో సోనియా, రాహుల్ గాంధీల హుందాతత్వంగల వారసుల ం కాంగ్రెస్‌పార్టీ నాయకులమని తి మ్మాపూర్ మండల కాంగ్రెస్‌పార్టీ అ ధ్యక్షుడు దమ్మననేని నర్సింగరావు అ న్నారు. తిమ్మాపూర్ మండల కేం ద్రంలోగల ప్రెస్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి మండలశాఖ అ ధ్యక్షుడు నర్సింగరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో తిమ్మాపూర్ మండలం జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్‌పర్షన్‌గా, మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న ఆరెపల్లి మోహన్ ఆరు మండలాలలో ఏ ఒక్క వ్యక్తినైనా దూషించిన సంఘటన లేదని స్పష్టంచేస్తూ ఏఒక్క వ్యక్తినైనా దూషించినట్లు క్లిప్పింగ్ లాంటి వి తీసుకువస్తే దేనికైనా సిద్దంగా ఉ న్నామని సవాల్ విసిరారు. చిల్లర రాజకీయాలు చేస్తూన్నారని ఆరెపల్లి మో హన్‌ను అనడం రసమయికి సమజ సం కాదని కాంగ్రెస్ పాలనలో ఏ ఒ క్కరోజునైనా దుర్భాషలాడిన సంఘట న లేదని ప్రజలు గమనిస్తున్నారని అ న్నారు. మొన్న ఇల్లంతకుంటలో, నిన్న తిమ్మాపూర్‌లో రసమయి నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో నిరసన లు, వ్యతిరేకతలు చూసి మరోసారి గె లువడం కష్టంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెపల్లి మోహన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. రాజకీయంలో పార్టీ ప రంగా ఏ వ్యాఖ్యలు చేసినా వ్యక్తిగత దూషణలు రసమయికి సరికాదనా నరు. నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ ను ండి అధికసంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయాన్ని రసమయి జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌లో సరైన క్రమశిక్షణ, గుర్తింపు లాంటివి లేకపోవడం ద్వా రానే ఆ పార్టీలో ఉన్న వివిధ శాఖల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పా ర్టీలో చేరి ఈసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్దం అవుతున్నారన్నారు. దేశచరిత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్భాషలాడిన సంఘటనలు లేవని కాని తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 70ఏళ్ళపాటు దేశా న్ని పాలించిన కాంగ్రెస్ నాయకులపై దుర్భాషలాడటం వీరికే చెల్లిందనా నరు. రూలింగ్ పార్టీలో ఉన్నవారికి కొంత వ్యతిరేకత తప్పదని, ప్రజలు చిన్న చిన్న ప్రశ్నలు అడిగితేనే సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో రసమ యి ఉన్నాడని ఆరోపించారు. వ్యక్తిగత దూషణలకు పోయినవారు రాజకీయాలకు పనికిరారని రసమయికి హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వంలో మానకొండూర్ ఎమ్మెల్యేగా రసమయి గెలిచినతరువాత 210 కేసులను పెట్టించాడని, అలాగె 14 మం దిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పెట్టించాడని ఆరోపించారు. మానకొండూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో తెలంగాణ పాస్‌పుస్తకాలు రాక రైతులు ఇబ్బందులకు గురి అవుతున్న మాట నిజం కాదా అని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, పోరండ్ల సింగిల్‌విండో చైర్మన్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మాజీ సింగిల్‌విండో చైర్మన్ ఎస్‌ఎల్ గౌడ్, ఎల్కపల్లి సంపత్, మేడి అంజయ్య, కాటుక రాజవౌ ళి, గూడ కనకయ్య, గూడ కమలాకర్, సంపత్, సా గర్ తదితరులు పాల్గొన్నారు.