కరీంనగర్

ఎన్నికల నిర్వహణకు పరస్పరం సహకరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, అక్టోబర్ 22: పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించడానికి పరస్పరం సహకారం అందించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన కోరారు. అంతరాష్ట్ర, వివిధ జిల్లాల అధికారులతో సరిహద్దు పరిధిలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులతో సోమవారం ఎన్టీపీసీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలను సక్రమంగా నిర్వహించడానికి అధికారులు పరస్పరం సహకరించుకోవాలని అన్నారు. మద్యం, డబ్బుతో ప్రజలను ప్రలోభ పెట్టకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలలో ప్రజలను మభ్య పెట్టేందుకు అభ్యర్థులు నూతన విధానాలు అమలు చేసే అవకాశం ఉందని, వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికలలో జిల్లా సరిహద్దుల నుంచి డబ్బు, మద్యం ప్రవహించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, దీన్ని నివారించడానికి తగిన విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడానికి డబ్బు పంపిణీ, ఓటర్ల ప్రలోభ పెట్టే చర్యలను పూర్తి స్థాయిలో నివారించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు. మంథని నియోజక వర్గ పరిధిలో ఇతర జిల్లాలో ఉన్న 120 పోలింగ్ కేంద్రాలల్లో 72 పోలింగ్ కేంద్రాలు సాధారణంగా ఉన్నాయని, 48 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. దీనిని నివారించడానికి పోలీసు పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు 48గంటల ముందు దరఖాస్తు చేసుకునే విధంగా వారికి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి, రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ, గడ్చిరోలి అదనపు కలెక్టర్ దామోదర్ నంజే, మంచిర్యాల డిసిపి వేణుగోపాల్, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.