కరీంనగర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 22: జిల్లాలో త్వరితగతిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ జి.వి.శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు. సోమవారం జెసి చాంబర్‌లో సివిల్ సప్లై అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 187 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అందులో సోమవారం గట్టుదుద్దెనపల్లి, లక్ష్మీపూర్, పచ్చునూరు గ్రామాలలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రం, ఫ్లెక్సీ, లీగల్ మెట్రాలజీ, స్టాంప్, టేబుల్, కుర్చీలు, లైట్లు, గన్నీ సంచుల స్టోర్ రూమ్‌లు, టార్పాలిన్‌లు ఉండేవిధంగా చూడాలని ఆదేశించారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. దాన్యం కుప్పలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకపోకుండాచూడాలని, ఇంటి వద్దే రైతులు పండించిన ధాన్యం తేమ లేకుండా ఆరబెట్టి తీసుకువచ్చేలా అధికారులు సూచించాలని ఆదేశించారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకంలో ఆలస్యం చేయకుండా వెనువెంటనే కొనుగోల్లు జరిగేలా చూడాలని, ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధర ప్రతీ రైతుకు అందించేలా అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు. కొనుగోలు కేంద్రాలలో హమాలీలను అందుబాటులో ఉండేలా చూడాలని, ఈ బాధ్యత అదికారులు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లుల్లోకి వెళ్లగానే మూడు గంటల్లోపు అన్‌లోడ్ చేసుకోవాలన్నారు. పేస్-1, ఫేస్-2 లలో ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారుల తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. రోజువారి కొనుగోళ్ల నివేదికను వెనువెంటనే అందించాలని, జాప్యం చేస్తే చర్యలు తప్పవని సంబందిత అధికారులను హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వ్యవసాయ శాఖ ఎఇలు, ఎఇఓలు సహాయ సహకారాలు అందించాలన్నారు. రైతులు తమ సమస్యలను, సలహాలను, సూచనల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని, ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా తమకు సమాచారం అందిస్తే వెనువెంటనే కొనుగోళ్లు జరిగేలా, మద్ధతు ధర చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జెసి వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి గౌరిశంకర్, అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారిణి పి.వసంత లక్ష్మి, సివిల్ సప్లై డిప్యూటి తహశీల్దార్లు శంకర్, వేణుగోపాల్, సతీష్ కుమార్, జిల్లా మేనేజర్ బి.ప్రవీణ్ కుమార్, కరీంనగర్, తిమ్మాపూర్, హుజూరాబాద్ పుడ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.