కరీంనగర్

మీడియా సెంటర్ ద్వారా ఎన్నికల సమాచారం: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 22: శాసనసభ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడి యా సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎన్నికల మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఎప్పటికప్పుడు అందజేయబడుతుందని అన్నారు. మీడియా సెంటర్‌లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అవసరమైన సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా పంపించుకోవచ్చని అన్నారు. మీడియా సెంటర్‌లో ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి వార్తలను (లోకల్ ఛానల్) ఎన్నికల వార్తలను రికార్డింగ్ చేస్తున్నామని తెలిపారు. వార్తలు నిష్పక్షపాతంగా రాయాలని మీడియా ప్రతినిధులకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఛానల్స్‌లో ఇచ్చే ప్రకటనలకు సంబంధించి మీడియా సర్ట్ఫికేషన్ మానిటరింగ్ కమిటి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ప్రింట్ మీడియాలో వచ్చే చెల్లింపు వార్తలను ఎంసిఎంసి కమిటి పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఎంసిఎంసికి జిల్లా ఎన్నికల అధికారి అయిన ఛైర్మన్‌గా వ్యవహరిస్తానని అన్నారు. వార్తలను వార్తగానే రాయాలని, ప్రకటనలాగా ఉండకుండా చూడాలని మీడి యా ప్రతినిధులకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏది చెబితే అది రాయకుండా, పూర్తిగా విషయం తెలుసుకొని రాయాలన్నారు. చెల్లింపు వార్తలపై రెండు మూడు రోజుల్లో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. మీడియా సెంటర్‌లో కంప్యూటర్లు, టెలీఫోన్ (ల్యాండ్ లైన్) తదితర సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. మీడియా సెంటర్‌ను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు సద్వినియోగంచేసుకోవాలని కోరారు. మీడియా సెంటర్‌కు సంబంధించి ఏమైనా సమస్యలుంటే మీడియా సెంటర్ అధికారి సమాచార శాఖ ఉప సంచాలకులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, ట్రెయినీ కలెక్టర్ ప్రావిణ్య, జాయింట్ కలెక్టర్ జి.వి.శ్యాంప్రసాద్ లాల్, జిల్లా రెవెన్యూ అధికారి భిక్షునాయక్, సమాచార శాఖ ఉపసంచాలకులు ఎన్.వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.