కరీంనగర్

వాస్తవ పరిస్థితులను అవగతం చేసుకుంటేనే ఉద్యోగాల్లో రాణిస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, అక్టోబర్ 22: గ్రౌండ్ రియాల్టీని అర్థం చేసుకుంటేనే ఉద్యోగ జీవితంలో రాణించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడవచ్చని జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. 93వ బ్యాచ్‌కు చెందిన 20 మంది ఆలిండియా సర్వీస్, సివిల్ సర్వీస్ అధికారులు శిక్షణలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలలో అధ్యయనం చేసేందుకు సోమవారం జిల్లా కేంద్రంకు వచ్చారు. ఆ వెంటనే కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలక వ్యవస్థలో వచ్చిన మార్పులు, ప్రభుత్వ పథకాలు, అబివృద్ది కార్యక్రమాలు, వాటి ఉద్దేశ్యం, లక్ష్యాలను, సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్ శిక్షణ సివిల్ సర్వీస్ అధికారులకు వివరించారు. జిల్లాల పునర్ విభజన వల్ల ప్రజలకు పాలన మరింత చేరువ అయిందన్నారు. పౌర సేవలు త్వరితగతిన ప్రజలకు అందే ఆస్కారం లభించిందన్నారు. సివిల్ సర్వీస్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పంచాయతి రాజ్ వ్యవస్థ, పరిపాలన విభాగాలు, ప్రాజెక్టులు, విద్య, వైద్యం, వ్యవసాయ సంస్కరణల గురించి కూలంకషంగా వివరించారు. పల్లెలలోవస్తున్న మార్పులను విడమరిచి చెప్పారు. శిక్షణ సివిల్ సర్వీసెస్ అధికారులు వాస్తవ పరిస్థితిని కూలంకషంగా అవగతం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాలన యంత్రాంగంపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. పారదర్శక పాలనందిస్తూ..క్విక్ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అపరిష్కృత అంశాలను అధ్యయనం చేసి పరిష్కారంకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగ జీవితంలో తమకు ఎదురైన సవాళ్ళను..వాటిని చాలెంజ్‌గా తీసుకుని పరిష్కరించిన విధానంను శిక్షణ సివిల్ సర్వీస్ అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ మెరుగైన శాంతి భద్రతలు నెల కొల్పేందుకు శాఖ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వో ఖీమ్యానాయక్, డీఎస్పీ వెంకటరమణ, డీఆర్‌డీవో రవీందర్, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ సివిల్ సర్వెంట్లు కోనరావుపేట మండలం మామిడిపల్లి, బోయినపల్లి మండలం నర్సింగాపూర్, ఇల్లంతకుంట మండలం రేపాక, గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో పర్యటించి గ్రామాలలో ప్రభుత్వ, సంక్షేమ కార్యక్రమాల ప్రగతి, గ్రామీణ జీవనంపై అధ్యయనం చేశారు. ఈ నెల 28న శిక్షణ సివిల్ సర్వీస్ అధికారులు జిల్లాలో ఉండి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.