కరీంనగర్

అట్రాసిటీ కేసులు వేగంగా పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 23: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అట్రాసిటీకి కేసులను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అట్రాసిటీ కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. బాధితులకు ఎఫ్‌ఐఆర్ కాపీలను అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగిన అట్రాసిటీ విచారణకు హాజరగు బాధితులకు, సాక్షులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రవాణా ఖర్చులను విధిగా చెల్లించాలన్నారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి సంఘటనా స్థలంలో పూర్తి విచారణ జరిపించాలన్నారు. నిర్లక్ష్యంగా వదిలేయకుండా సమగ్ర విచారణ కొనసాగించి కేసులు నమోదు చేయాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన విచారించి బాధితులకు పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతీ నెల 30వ తేదీన జిల్లాలోని అన్ని మండలాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని సంబంధిత అధికారులను జెసి ఆదేశించారు. సివిల్ రైట్స్ డేలో ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధి రుణాల మంజూరు అర్హులైన వారికి పింఛన్లు, మూఢ నమ్మకాల నిర్మూళన, ప్రనుత్వ సంక్షేమ పథకాల సద్వినియోగంపై ఎస్సీ, ఎస్టీలను చైతన్యం చేసే బాధ్యతను జిల్లాలోని అన్ని మండలాల అదికారులు తీసుకోవాలని సూచించారు. సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి కేసుల నమోదు, పరిష్కారం దిశగా ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించేందుకు క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం చేయకుండా సమగ్ర విచారణ కొనసాగించి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జెసి ఆదేశించారు.

సిరిసిల్లలో పోటీకి దూరం
* బీసీల్లో ఇంకా రాజకీయ చైతన్యం
రానందుకే ఈ నిర్ణయం
* సంఘం రాష్ట్ర నేత హన్మాండ్లు
సిరిసిల్ల, అక్టోబర్ 23: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం పోటీకి దూరంగా ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిథి పర్శ హన్మాండ్లు వెల్లడించారు. బీసీలు ఇంకా రాజకీయ చైతన్యం కానుందున సిరిసిల్లలో ఎమ్మెల్యేలో పోటీ చేయడం చేయడం లేదని మంగళవారం బీసీ భవన్‌లో జిల్లా స్థాయి బీసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు రాపెల్లి రమేశ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మాట్లాడతు బీసీ ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ చైతన్యం కానందున ఇపుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. గత 25 సంవత్సరాలుగా బీసీలను ఐక్యం చేస్తూ వారి సమస్యలపై పోరాడుతూ ప్రతిపక్ష పాత్ర పోషించానన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా తనపై నమ్మకంతో తన పేరును ప్రకటించారని, వారికి ధన్యవాదాలు తెలుపుతూనే ప్రస్తుత పోటీ పరిస్థితిలో పోటీ చేయనందుకు చింతితస్తున్నట్టు తెలిపారు. గందరగోళానికి, సందిద్గతకు తావీయకుండా తెర దించడానికే వివరణ ఇస్తున్నట్టు హన్మాండ్లు తెలిపారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టీజేఎస్, బీఎస్పీ, బీఎల్‌ఎఫ్, బీఆర్‌ఎస్ పార్టీలు తనను కోరాయని, ఎన్నికల్లో కోట్ల రూపాయల ఖర్చు దృష్ట్యా పోటీని తిరస్కరించానన్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలు అధికార టీ ఆర్ ఎస్, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని, బీసీ నినాదం తెలంగాణ ఉద్యమంలాగా తీశ్ర రూపం దాల్చలేదన్నారు.2001లో పీడిత ప్రజల విముక్తి కోసం నక్సలైట్ కేసుల్లో, అలాగే 2014లో బీసీ ఉద్యమం సందర్భంగా రెండు సార్లు జైలు జీవితం అనుభవించానని, బీసీలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తూనే ఉంటానన్నారు. గతంలో తన సతీమణి సర్పంచ్‌గా పని చేసిందని, గంభీరావుపేట జడ్పీటీసీగా కూడా పోటీ చేసి 10 వేల ఓట్లు సాధించిందన్నారు. భవిష్యత్తులో బీసీలను సంఘటితం చేసి తానే పూర్తి స్థాయిలో సేవ చేసేందుకు స్వయంగా ఎన్నికల బరిలో ఉంటానన్నారు.