కరీంనగర్

అసంఘటిత కార్మికులకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, అక్టోబర్ 23: సింగరేణి కార్మిక నేపథ్యం నుండి రాజకీయాలలో అడుగిడిన తమకు కార్మికుల సమస్యలన్నీ కరతల అమలకాలేయని, అసంఘటిన కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రభుత్వ తాజామాజీ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం ధర్మపురి క్షేత్రంలో తెరాస కార్మిక విభాగ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కొప్పుల ఈశ్వర్‌కు ఆశీర్వాద సభలో, ఈశ్వర్ ప్రసంగిస్తూ, ప్రస్తుత ఎన్నికలలో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, తమ గెలుపు తథ్యమని, సోదర కార్మికులను కడుపులో పెట్టుకుంటామన్నారు. హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు విషయం మేనిఫెస్టోలో పెట్టే కృషి చేస్తామన్నారు.
కేసిఆర్ ప్రభుత్వం ఆటో ట్యాక్స్ రద్దు, వివిధ కార్మికులకు బీమా వర్తింపు లాంటి ఎన్నో చేపట్టిందన్నారు. తాము 15వేల మంది కార్మికులకు స్వయం ఖర్చుతో సభ్యత్వాలు చేయించామని, లేబర్ కార్డు వల్ల పలు లాభాలున్నాయన్నారు. ప్రమాదాలు, గాయాలు, వివాహాలు, చదువులు ఎన్నింటికో బీమానే కాక, ప్రభుత్వం ద్వారా డబ్బులు రాగలవని, కార్డు ఉపయోగ కరమన్నారు. నిర్లక్ష్యం మాని, వివిధ కార్మికులు 112 రూపాయల చెల్లింపుతో సభ్యత్వాలు పొందాలన్నారు. నాయకుల ప్రమేయం లేకుండా కార్మిక సంఘాల స్వచ్చందంగా వందలాది మందిని ప్రోగు చేసి, తమను ఆశీర్వదించి, అభిమానించి, మద్దతు తెలిపిన తీరును జీవితాంతం మరువజాలనన్నారు. టిఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర ప్రథమ అధ్యక్షులు రూప్‌సింగ్, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నారాయణ, జిహెచ్‌ఎంసి కార్మిక నాయకురాలు నిర్మలారెడ్డి, రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షులు మారయ్య, వివిధ సంఘాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, వౌలానా, వెంకన్న, మల్లేశం, రామన్న, కొమురయ్య, గంగాధర్, పోచన్న, లక్ష్మణ్, సత్తయ్య, లింగన్న, లచ్చయ్య, దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్, కోఆప్షన్ సభ్యులు ఆసిఫ్, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్, నాయకులు భీమన్న, మల్లేశం, శంకర్, మల్లేశం, మహేశ్, లక్ష్మణ్, అశోక్, కిశోర్‌రావు తదితరులు వేదికాసీనులు కాగా, ఆరు మండలాల ఆటో, హమాలీ, భవన, తాపీమేస్ర్తి సంఘాల బాధ్యులు, సభ్యులు వందలాదిగా పాల్గొన్నారు. ఈశ్వర్‌ను గజమాలతో సత్కరించారు. అంతకు ముందు అంబేడ్కర్ చౌరస్తా నుండి డప్పుల చప్పుళ్ళ మధ్య ర్యాలీ నిర్వహించి, వేదికదాకా ఘన స్వాగతం పలికారు.

దారిద్య్రాన్ని పారదోలిన కేసీఆర్
-రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవిశంకర్
చొప్పదండి, అక్టోబర్ 23: గత డెభ్భై ఏళ్ల నుంచి కాంగ్రెస్, టిడిపితో పాటు ఇతర పార్టీలు తెలంగాణను దోచుకొని కటిక దారిద్య్రాన్ని నింపితే కేవలం నాలుగున్నర ఏళ్ళలో రాష్ట్ర ఆపధ్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలతో తెలంగాణను అభివృద్ది పథంలోకి తీసుకొచ్చారని ఇది యావత్ తెలంగాణ ప్రజలు గమనించారని, ఇక రాబోయే ఎన్నికల్లో తరిగి కెసిఆర్‌కు పట్టం కట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని టిఆర్‌ఎస్ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం చొప్పదండి మండల పరిదిలోని రేవెల్లి గ్రామంలో గ్రామ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా తెలంగాణలో అన్ని రంగాలకు న్యాయం చేసే విధంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత కెసిఆర్‌కు మాత్రమే చెల్లుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేవలం కెసిఆర్ పాలనతోనే సాథ్యం అవుతుందని, ఇక ఏ పార్టీతోను సాధ్యం కాదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పని చేయని ప్రతి పక్షాలు ఇప్పుడు గగ్గోలు పెట్టడాన్ని చూసి ప్రజలే నవ్వుకుంటున్నారన్నారు. గ్రామంలో పలు పనులు చేస్తున్న వారి వద్దకు వెళ్లి వారి పని చేస్తు ఓటును రవిశంకర్ అడిగారు.