కరీంనగర్

కరీంన‘గరం’గరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 23: ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కరీంన‘గరం’ గరంగా మారుతుంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల అభ్యర్థులు అభివృద్ధి హామీలు విస్మరించి, రాజకీయ ఆరోపణలతో నగరాన్ని వేడేక్కిస్తున్నారు. వ్యక్తిగత దూషణల నేపథ్యంలో ఇరు పార్టీల అభ్యిర్థులు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవటంతో మొన్న తాజామాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై, నేడు భాజపా అభ్యర్థి బండి సంజయ్‌పై కేసులు నమోదయ్యాయి. ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా బహిరంగ సభ సందర్భంగా బండి సంజయ్ చేసిన ఆరోపణలకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆ మరునాడు విలేఖరుల సమావేశంలో పరుషపదజాలంతో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు.
దీనిని సీరియస్‌గా తీసుకున్న భాజపా రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మీడియాలో వచ్చిన ఆధారాలతో సహా సమర్పించడంతో స్పందించిన ఎన్నికల సంఘం విచారించి కేసు నమోదు చేయాలంటూ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, రెవెన్యూ డివిజనల్ అధికారితో రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ దేవారెడ్డి గంగుల కమలాకర్‌పై కేసు నమోదు చేశారు. దీనిని జీర్ణించుకోలేక ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న గంగుల వర్గం తన నాయకుడు గంగుల కమలాకర్‌పై భాజపా అభ్యర్థి బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేశాడని మంగళవారం డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళ రమేష్ ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ సీఐ తుల శ్రీనివాసరావు తెలిపారు. కాగా ప్రచారం వీడి వ్యక్తిగత విమర్శలు, దూషణలకు పోవటం, కేసుల నమోదు కావటం, ఎన్నికల వేళ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై కేసు నమోదు కావటం ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొదటిది కాగా భాజపా అభ్యర్థి సంజయ్‌పై కేసు నమోదు కావటం రెండోది కావటం గమనార్హం.

వీఆర్వోను నిర్భందించిన గ్రామస్థులు
తిమ్మాపూర్, అక్టోబర్ 23: రైతు పాసు పుస్తకాల పంపిణీ చేయడంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులతో కలిసి స్థానిక ఎంపిటీసీ సభ్యుడు పెరుక రవి వీఆర్వో శ్రీశైలంను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్భందించిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పోలంపల్లి గ్రామం నుండి ఇటీవల విడిపోయి స్వంత గ్రామ పంచాయతీగా ఏర్పడిన నర్సింగాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీలో రైతు పాసు పుస్తకాలను ఆ గ్రామ వీఆర్వో శ్రీశైలం లబ్దిదారులకు పంచుతుండగా అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు పెరుక రవి వీఆర్వోను నిర్భందించినట్లు తెలిసింది. ఎన్నిక కోడ్ రావడంతో ప్రభుత్వం తహశీల్దార్‌లను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా తిమ్మాపూర్ మండలానికి తహశీల్దార్‌గా రజితను నియమించారు. తహశీల్దార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కార్యాయలంలో రైతు పాస్ పుస్తకాలు కనబడటంతో వీఆర్వోలను పిలిచి రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు ఎవరివి వారికి పంచాలని ఆదేశించారు. దీంతో వీఆర్వో శ్రీశైలం రైతు పాస్ పుస్తకాలను తీసుకొని వెళ్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాయలంలో పంచుతుండగా గత ఆరు మాసాల నుండి పంచని రైతు పుస్తకాలు ఇప్పుడు ఎలా పంచుతున్నావని ఆగ్రహించిన ఎంపీటీసీ సభ్యుడు కార్యాయలంలో నిర్భందించి తాళం వేయగా ఉన్నతాధికారులు ఆర్‌ఐ రాజు స్పందించి సర్ది చెప్పడంతో తాళం తీశాడు. ఇదిలా ఉండగా నర్సింగాపూర్ గ్రామంలోని కొంతమంది రైతుల వద్ద వీఆర్వో శ్రీశైలం భూమిని విరాసత్, పాసు పుస్తకాలు త్వరలో ఇస్తానంటూ వారి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఆరు నెలలో గడిచినా పాస్ పుస్తకాలు రాకపోవడంతో గ్రామస్థులు ఎంపీటీసీ సభ్యుడైన పెరుక రవిని ఆశ్రయించారు. దీంతో ఎంపీటీసీ రవి వీఆర్వోను నిలదీయగా సరైన సమాదానం రాకపోవడంతో కార్యాలయంలో ఉంచి తాళం వేసినట్లు తెలుస్తోంది.