కరీంనగర్

నగరంలో నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 23: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నారని అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిరంతరం నిఘాను తీవ్రతరం చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండగా భారీ మొత్తంలో నగదు పట్టుబడుతుందని మంగళవారం విలేఖరులకు ఆయన వివరించారు. సోమవారం రూ.18.24.700 నగదు పట్టుబడగా, మంగళవారం రాత్రి పోలీసుల తనిఖీల్లో రూ.2,16,300 పట్టుబడినట్లు తెలిపారు. సిద్ధిపేటకు చెందిన పండు కుమార్ వద్ద ఒక లక్ష రూపాయలు, రెబ్బెనకు చెందిన వడాయి బాలాజీ వద్ద లక్షా 16 వేల 300 పట్టుకున్నామని వివరించారు. పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి ఈ డబ్బులు ఎక్కడి నుండి తీసుకువచ్చారు? ఎక్కడికి సరఫరా చేస్తున్నారు? అనే విషయమై సమగ్ర విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వివిధ రూపాల్లో నగదు సరఫరా చేస్తున్నట్లు ఖచ్చితమైన సమాచారం అందడంతోనే విస్తృత తనిఖీలు చేపట్టి పెద్దఎత్తున లభ్యమవుతున్న డబ్బులను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఎన్నికలు ముగిసేవరకు పోలీస్ నిరంతర నిఘా కొనసాగుతూనే ఉంటుందని, ఎవరైనా సరే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులను తీసుకెళ్తున్నప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలను పూర్తి స్థాయిలో చూపించాల్సిన అవసరముందని, లేకపోతే వ్యక్తులపై కేసులు నమోదు చేసి డబ్బులు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఈ డబ్బులను ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నది? ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? అనేది ఆధారాలతో సహా చూపించి తమ డబ్బులను తీసుకోవచ్చునని సీపీ తెలిపారు.