కరీంనగర్

బతుకునిచ్చిన నేతకు.. భరోసాగా నేతన్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, అక్టోబర్ 23: బతుకునిచ్చిన నేతకు భరోసాన కల్పిస్తూ, టీఆర్‌ఎస్ వెంటే తామంతా ఉన్నామని చాటి చెప్పేందుకు సిద్దమవుతున్నారు నేతన్నలు. చేతినిండా పని లేక, తినడానికి తిండిలేక అన్నమో రామచంద్రా అంటూ ఊగులాడుతున్న కార్మికులకు, చేతినిండా పని కల్పించి బుక్కెడు బువ్వ పెట్టి తమ బతుకుల్లో భరోసానింపిన నాయకునికి కృతజ్ఞతలు తీర్చుకుంటామంటున్నారు సిరిసిల్ల నేతన్నలు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా సిరిసిల్లలో నవంబర్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు వస్త్ర వ్యాపార పరిశ్రమ ప్రతినిథులు మంగళవారం మంత్రి కె.తారకరామారావును హైదరాబాద్‌లో కలిసి సభకు రావాలని ఆహ్వానించారు. చేనేత, మరమగ్గాల కార్మికులు, వ్యాపారులు, ఆసాములు అందరు బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హజరవుతారని తెలిపారు. నేత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన టీఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్య మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతగా సభ నిర్వహించబోతున్నట్టు మంత్రికి విన్నవించారు. సభకు రావాల్సిందిగా కేటీఆర్‌కను ఆహ్వానించాచగా, అందుకు మంత్రి అంగీకరించారు.
సిరిసిల్లను వస్త్ర వ్యాపార కేంద్రంగా మారుస్తామని మంత్రి కె.తారకరామారావు ఈ సందర్భంగా వస్త్ర వ్యాపార ప్రతినిథులకు తెలిపారు. దేశంలోని చేనేత దస్తుల్లో సిరిసిల్ల బ్రాండ్ ఉండేలా ఇక్కడి కార్మికుల పనితీరు ఉండాలని, అందుకు అవసరమైనవసతులు కల్పిస్తామన్నారు. ఇప్పటికే కార్మికుల కోసం ప్రభుత్వానికి అవసరమైనఅన్ని దుస్తుల తయారీ ఆర్డర్లను సిరిసిల్లకు అప్పగించామన్నారు.. బతుకమ్మ చీరల తయారీ వలన ఒక్కో కార్మికుడు నెలకు రూ.10 వేల నుండి రూ.20 వేల వేతనం పొందుతున్నారని గుర్తు చేశారు. టెక్స్‌టైల్ పార్క్‌లోని మరమగ్గలను ఆధునీకరించుకోవడం వలన వస్త్ర ఉత్పత్తిని పెంచామన్నారు. అపెరల్ పార్క్ ద్వారా దాదాపు 10 వేల మంది మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. ఓక్కో నేతరంగంలోనే కాకుండా సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. రానున్న మూడేళ్ళలో రైలును తీసుకవచ్చి సిరిసిల్ల వ్యాపారాన్ని దేశ వ్యాప్తంగా విస్తరింప చేస్తామన్నారు. మిడ్ మానేరు పూర్తి కావడం వలన సిరిసిల్లలోతాగునీరు,సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. బహుముఖ వ్యూహంతో సిరిసిను అభివృద్ది పథంలో ముందుకు తీసుకవెలుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, తెరాస రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, నాయకులు చీటి నర్సింగరావు, పట్టణ తెరాస అధ్యక్షులు జిందం చక్రపాణి, వస్త్ర రంగ ప్రముఖులు మండల సత్యం, కళ్యాడపు సుభాష్, దూడం శంకర్, గోవింద్ రవి, బికె.రాజు, వెల్దండి దేవదాస్, దుబాల మొండయ్య, బూట్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.