కరీంనగర్

మొక్కలను సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, నవంబర్ 13: నగరంలో నాలుగు విడతలుగా నాటిన మొక్కలు సంరక్షించాలని, బల్ధియా కమీషనర్ కె.సత్యనారాయణ అన్నారు. మంగళవారం నగరంలోని మార్కెట్ వాటర్ ట్యాంక్‌లో హరితహారం సిబ్బందితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలోమాట్లాడుతూ, హరితహారం నీటి సరఫరా ట్యాంకర్లు నీటిని తరలిస్తున్న ప్రాంతంలోని వ్యక్తులతో నమోదు పుస్తకంలో సంతకం తీసుకోవాలన్నారు. సంబంధిత ఏరియాలో సరఫరా చేసిన అనంతరం స్థానికుల ఫోన్ నెంబర్ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ట్యాంకర్ ట్రిప్‌కి ఒక వ్యక్తి నెంబర్ సేకరించి, సమర్పించాలన్నారు. ఎప్పటికప్పుడు లాగ్ బుక్‌లో, ట్రిప్స్ షీట్ రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. అంతకుముందు నగరంలో నాటిన మొక్కల సంరక్షణ చర్యలు, రోజు వారీగా ట్యాంకర్లతోనీటిని అందిస్తున్న వివరాలు సిబ్బందిని అడిగి తెల్సుకున్నారు. అనంతరం వాటర్ ట్యాంక్ నుంచి నిత్యం తరలి వెళ్తున్న నీటి ట్రిప్పుల జాబితాతో పాటు లాగ్‌బుక్కులు పరిశీలించారు. హరితహారం వాటర్ ట్యాంకర్ల నీటి సరఫరాలో చౌర్యం జరుగుతందన్న సమాచారంపై క్రాస్ చెకింగ్ చేశారు. అలాగే, మున్సిపల్ ఎలక్ట్రికల్ సిబ్బందితోసమావేశం నిర్వహించారు. నగరంలోని 50 డివిజన్ల పరిధిలో వెలుగుతున్న లైటింగ్ వివరాలు, విద్యుత్ ఇబ్బందులు అడిగి తెల్సుకున్నారు. వీధి దీపాల్లో ఆటోమెటిక్ ఆన్ ఆఫ్ సిస్టమ్‌పై సంబంధిత ఈఎస్‌ఎస్ సంస్థ యాజమాన్యంపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. సంస్థ ఒప్పందం మేరకు విధులు నిర్వహిస్తూ, సేవలందించాలన్నారు. ఈసమావేశంలో డీఈ రామన్, హరితహారం అధికారులు, సిబ్బంది, నీటి ట్యాంకర్ల డ్రైవర్లు పాల్గొన్నారు.