కరీంనగర్

నారుూబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తుల అభివృద్దిలో భాగంగా నాయిబ్రహ్మణులకు 250కోట్లతో సంక్షేమ పథకం అముల చేశామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపిఅర్ గార్డెన్‌లో హుజురాబాద్ నియోజవర్గ స్థాయి నాయిబ్రహ్మణుల అధ్వర్యంలో అశీర్వాద సభ నిర్వహంచారు. ఈ సందర్బంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ అనాడు తెలంగాణ ఉద్యమంలో నాయిబ్రహ్మణులు రోడ్లపై చేసిన ధర్నలు,అందోళనలు వృధాగా పోలేదన్నారు. టిఅర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమాజంలోని ప్రతి కులాల అభృవృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నమన్నారు. రిలియన్స్ వంటి సంస్థలు కుల వృత్తులను దోచుకునేందుకు వ్యాపార దృక్పథంలో వస్తుందని తెలుసుకున్న ప్రభుత్వం,నాయిబ్రహ్మణుల వృత్తి అభివృద్ది కోసం శిక్షణ,నైపుణ్యం కలిగిన వారికి రుణాలు అందజేస్తున్నమన్నారు. బడుగు,బలహీన వర్గాల అభవృద్ది కోసం కళ్యాణలక్ష్మి,కెసిఅర్ కిట్టు,విద్య,వైద్య,పించన్ల్ ,డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు,మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు.సమాజంలో నాడి తెలిసిన వ్యక్తులగా నాయిబ్రహ్మాణులు మొదటి వరసలో ఉంటారన్నారు. సమాజ శ్రేయస్సుకోసం ఉద్యమిస్తారన్నారు. మీలో ఒకడగా పని చేస్తున్ననని ,రాన్నున ఎన్నికల్లో ఓటు వేసి అశీర్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఅర్ ఎస్ నాయకులు తక్కళ్ళపెల్లి రాజేశ్వర్‌రావు,తుల ఉమ, బండ శ్రీనివాస్,పోనగంటి మల్లయ్య, నాయిబ్రహ్మణుల సంఘ నాయకులు ముత్యల నాగయ్య, మురారి రాజు,రమేష్,శ్రీనివాస్,శంకర్,బిక్షపతి,సమ్మెట మల్లయ్య,బిక్షపతి,చంద్రయ్య,కోంరయ్యతోపాటు మండల నాయకులు,మహిళలు పాల్గోన్నారు.