కరీంనగర్

కూటమితో ఆగమాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్తాబాద్, నవంబర్ 13: తెలంగాణ ప్రజలు తమతలరాతలు తామే రాసుకునే ఎన్నికలని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆయన, మంత్రి ఈటల రాజేంధర్, జడ్పీ చైర్మన్ తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీంధర్‌రావులతో కలిసి, ముస్తాబాద్ మండలకేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. మేము అధికారం కోసం ఆరాటం పడటం లేదు మహాకూటమి అధికారానికి వస్తే ప్రాజెక్టుల నిర్మాణం ఆగుతుంది.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగుతాయి..24గంటల ఉచిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది..తెలంగాణ ప్రజలు ఆగమై పోతారని పేర్కోన్నారు. ప్రజలు విచక్షణతో ఓటేయాలని హితువు పలికారు. కాంగ్రెస్‌కు నాలుగు ఓట్లు వచ్చినా నీల్గుతారన్నారు. మీరు ఆశీర్వాదించి, టీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ సీఎం అవుతే, ఆసరా పెన్షన్ వెయ్యి రూ.ల నుంచి 2,016, వికలాంగ పెన్షన్ 3,016 అవుతుందన్నారు. వృద్ధ్యాప్య పెన్షన్ వయస్సు అర్హతను 58ఏళ్లకు కుదిస్తారన్నారు. కాంగ్రెస్ హయంలో నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం జరిగి తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని, తానూ ఈటల రాజేంధర్‌తో కలిసి, జానారెడ్డి మంత్రిగా ఉన్నపుడు సిరిసిల్ల నియోజకవర్గానికి రోడ్డు అభివృద్ధికి కోటీ నిధులు కేటాయించుమన్నా స్పందించలేదని, అప్పటి సీయం కిరణ్‌కుమార్‌రెడ్డి పైసా కూడ ఇవ్వనని అన్నాడని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరిగిన ముస్తాబాద్ తారురోడ్డును చూపించడానికే మంత్రి ఈటల రాజేంధర్‌కు ఇక్కడకు ఆహ్వానించానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని కాంగ్రెస్, టీడీపీలూ తెలంగాణ వచ్చాక కూడ అభివృద్దికి ప్రతిబంధకంగా మారాయని, మహకూటమిని గెలిపిస్తే జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుందని, కృష్ణ, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల్ని కట్టనిస్తారా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఏ సీయం చేయని విధంగా సీయం కేసీఆర్, పేదలకు, బడుగుబలహీనవర్గాలకు, రైతులకు, కులవృత్తుల సంక్షేమం లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేశారన్నారు. ఎవరిపై ఆధార పడకుండ ఆత్మగౌరవంతో బతకాలని వృద్ధులకు, పెన్షన్ మొత్తాన్ని వెయ్యి చేశారని, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, ఎయిడ్స్ బాధితులకు కూడ పెన్షన్ ఇవ్వడం దేశంలోనే చారిత్రాత్మకమని, పెన్షన్ ఇవ్వగానే వారూ కోటీశ్వరులు కారన్నారు. కాంగ్రెస్ హయంలో వ్యవసాయానికి 6గంటల విద్యుత్ కూడ నిరంతరంగా వచ్చేది కాదన్నారు. రైతు కష్టాలు తెలిసిన రైతుబిడ్డగా సీయం కేసీఆర్, 24గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్నారని, సాగు పెట్టుబడి కోసం రైతుబంధు, రైతుకుటుంబానికి అండగా 5లక్షలతో రైతుబీమా, డిమాండ్ మేర ఎరువులు, కోటీ ఎకరాల సాగునీరు లక్ష్యంగా కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని అన్నారు. నాలుగున్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతులు సంబరాలు చేసుకొంటున్నారని అన్నారు. 67ఏళ్లలో ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్, తెలంగాణ వచ్చాక అడ్డుకుంటున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు చచ్చినోళ్ల పేరిట వేలిముద్రలు వేసి, కోర్టుల్లో కేసులు వేసారన్నారు. కర్నాటక, తమిళ్‌నాడు రాష్ట్రాల్లో కావేరి నది జలాల సమస్యపై అక్కడి రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుతే ఇక్కడి కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకోవడం రైతు సాగునీటి సాధన లక్ష్యాణికి వ్యతిరేకం కాదా అని అడిగారు. సోనియామ్మ దయతో తెలంగాణ ఇవ్వలే తెలంగాణ ప్రజల ఉద్యమసెగతో వీపు చింతపండు అవుతుందని తెలంగాణ ఏర్పాటు చేశారన్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్దిని చూసి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. 4నెలల్లో ఎగువమానేరు ఎత్తిపోతల సంపూర్తి చేయిస్తానని అన్నారు. ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ శరత్‌రావు, జిల్లాగ్రంధాలయ చైర్మన్ శంకరయ్య, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్ చైర్మన్ నర్సయ్య, మండల చైర్మన్ గోపాల్‌రావు, సెస్ డైరెక్టర్ విజయరామారావు, సోసైటీ చైర్మన్లు చక్రధర్‌రెడ్డి, బాపురావు, మార్కెట్‌చైర్మన్ మల్లేశ్, టీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు కొమ్ము బాలయ్య, సంతోష్‌రావు, టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లాలో రెండో రోజు రెండు నామినేషన్లు

కరీంనగర్, నవంబర్ 13: కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి రెండవ రోజైన మంగళవారం రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ తరపున జానపట్ల స్వామి తన నామినేషన్‌ను నియోజకవర్గ రిటర్నింగ్ అదికారికి సమర్పించారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున చింత అనిల్ కుమార్ తన నామినేషన్ పత్రాన్ని నియోజకవర్గ రిటర్నింగ్ అదికారికి సమర్పించినట్లు ఆయన తెలిపారు. మిగిలిన కరీంనగర్, మానకొండూర్ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరు నామినేషన్లు సమర్పించలేదని వెల్లడించారు. జిల్లాలో ఇంతవరకు మూడు నామినేషన్లు అందాయని, ఇందులో మొదటి రోజు కరీంనగర్ నియోజకవర్గంలో, రెండవ రోజు చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నామినేషన్లు అందినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

కాంగ్రెస్‌లో అలకలు
- అభ్యర్థుల ప్రకటనతో మొదలైన లొల్లి

కరీంనగర్, నవంబర్ 13: ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనతోజిల్లాకాంగ్రెస్‌లో అలకలు మొదలయ్యాయి. ఒక్కో సెగ్మెంట్ నుంచి ముగ్గురు, నలుగురు సీనియర్లు ఆశావహులుగా మారగా, వారిని కాదని ఇతరులకు టికెట్లు ఖరారు చేస్తూప్రకటించగా, రెండు సెగ్మెంట్లలో లొల్లి మొదలైంది. ఏళ్ళ తరబడి తాము పార్టీకి సేవలందిస్తుంటే, తమను విస్మరించి నిన్న గాక మొన్న తీర్థం పుచ్చుకున్న వారికి టికెట్లెలా కేటాయిస్తారంటూ మండిపడుతున్నారు. చొప్పదండి, పెద్దపల్లి సెగ్మెంట్లలో టికెట్లు ఆశించిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు రాష్ట్ర నాయకత్వంతో జగడానికి దిగారు. తమ భవిష్యత్‌పై తాడోపేడో తేల్చుకునేందుకు తరలివెళ్ళారు. చొప్పదండి నుంచి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతంలు తీవ్రంగా పోటీ పడ్డారు. అలాగే, పెద్దపల్లి నుంచి గీట్ల సవితారెడ్డి, ఓ ఎన్‌ఆర్‌ఐ నేతతో పాటు మాజీ జడ్పీటీసీ ఈర్ల కొమురయ్య కూడా తమకే టికెట్ కేటాయించాలంటూ అధిష్టానానికి ధరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా ఎవరికి వారుగా తమకు రాజకీయ గురువులుగా భావించే కాంగ్రెస్ పెద్దలతో పైరవీలు కూడా చేశారు. వారి అభయహస్తంతోటికెట్ మాకేననే ధీమాతో ఉండగా, కొద్ది మాసాల క్రితం నుంచి సీన్ మారింది. టీటీడిపి వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, ఆయనతో పాటు ఆయన శిష్యబృందం కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో జిల్లానుంచి పలువురు నాయకులు చేరగా, చొప్పదండి, పెద్దపల్లి సెగ్మెంట్లనుంచి వీరికే టికెట్లు కేటాయించారు. దీంతో ఆయాచోట్ల అసమ్మతి రాజుకుంది. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సుద్దాల దేవయ్య తన ఆస్థులమ్మి గత ఎన్నికల్లో బరిలో నిలవగా, సానుభూతితో ఈసారి కూడా తనకే టికెట్ తథ్యమని భావించారు. అధిష్టానం మొండిచేయి చూపటంతోదిగాలు పడుతూ, తన రాజకీయ భవిష్యత్ ఇక ముగిసినట్లేననే ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. కాగా, సోమవారం అర్ధరాత్రి విడుదల చేసిన జాబితాలో ఉమ్మడి జిల్లానుంచి 8మంది అభ్యర్థులకు చోటు లభించగా, వారిలో ఐదు కొత్తముఖాలే ఉన్నాయి. మూడు చోట్ల పాత వారికే అవకాశం లభించగా, జిల్లాలో రేవంత్ వర్గానికి పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది.