కరీంనగర్

అవినీతిని అంతమొందిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 14: తెలంగాణ ప్రజలకు,నియంతృత్వ పాలనకు మధ్య జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆదరించి ఆశీర్వదిస్తే నిజాయితీగా, నిబద్ధతతో కరీంనగర్ గౌరవాన్ని పెంపొందిస్తా, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఈ ఎన్నికల్లో ప్రజాకూటమిగా అన్నీ పార్టీలు ఏకమై ముందుకొచ్చాయని తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ నియంతృత్వ పాలనకు మధ్య జరుగుతున్నాయన్నారు. హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టేనని మాకు రాజకీయం ‘అధికారం’ కొత్తకాదని, సెక్రటరియేట్‌కు పోని సీఎంను గద్దెదించాలన్నారు. కొండగట్టులో 62మంది చనిపోతే పరామర్శించడానికి క్షణం తీరిక లేని సీఎం మనకెందుకని ప్రశ్నించారు. తెలంగాణ అమరుల బలిదానాలను నిచ్చెనమెట్లుగా వాడుకొని అధికారంలోకి వచ్చాడన్నారు. అమరుల స్థూపం, 125్ఫట్ల అంబేడ్కర్ విగ్రహం నిర్మించలేదని, ఇచ్చిన వాగ్థానాలు అటుకెక్కించాడని కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియమ్మ ఏ కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ ఉద్దేశ్యం నెరవేరటం లేదని,ప్రగతి భవన్‌కు మాత్రమే తెలంగాణ బందీ అయిందని, ప్రగతి భవన్ నుంచి ఇక కేసీఆర్‌ను ఫామ్ హౌజ్‌కే పరిమితం చేస్తామన్నారు. గత పదేళ్లలో నగరం సర్వనాశనం చేశారని, ఎమ్మెల్యేగా ఎన్నికై చేసిన అభివృద్ధి శూన్యమేనని, ఉత్తర తెలంగాణలో మరోసారి ఉవ్వెత్తున కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు. నగర ప్రజలు రోగాలపాలవుతున్నా పట్టించుకున్న దాఖలాల్లేవ్, ఒక్క రోడ్డు నిర్మించేందుకు నాలుగున్నరేళ్లు పడుతుందా ..? అని ప్రశ్నిస్తూ తన వ్యాపారాభివృద్ది కోసమే ఎమ్మెల్యే పదవిని వినియోగించుకున్నారని ఆరోపించారు. మతపరమైన అంశాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలిచే యత్నాలుచేస్తున్న పార్టీలకు గుణపాఠం తప్పదన్నారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే అందుబాటులో ఉండి కాలుష్య రహిత నగరంగా కరీంనగర్‌ను మార్చుతానని వెల్లడించారు.