కరీంనగర్

ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాను.. ప్రథమ స్థానంలో నిలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 14: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం స్థానిక ఫిలిం భవన్‌లో వచ్చే ‘మార్చి 2019 ఎస్సెస్సీ పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన’పై ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత, జడ్పీ, ఆదర్శ, కేజిబివి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. సబ్జెక్ట్ టీచర్స్ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు 10వ తరగతిలో 10 జిపిఏ ఉత్తీర్ణత సాధించేలా విద్యాబోధన చేయాలన్నారు. డిసెంబర్‌లోగా సిలబస్ పూర్తి చేసి జనవరి 2019 నుంచి రివిజన్ తరగతులు చేపట్టాలని ఆదేశించారు. పదోతరగతి విద్యార్థుల స్టడి ఆవర్స్ తరగతులకు అల్ఫాహారం కోసం ప్రభుత్వ పాఠశాలలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. స్టడి ఆవర్స్‌ను నిర్వహించడంతో పాటు వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న మొత్తం 172 ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, గత ఏడాది జిల్లా 94.02 శాతం సాధించి రెండవ స్థానంలో నిలిచినప్పటికి, ఈ సారి ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఎన్నికల శిక్షణకు పాఠశాలల నుంచి అందరు ఒకే రోజు వెళ్లకుండా సగం మంది వెళ్లాలని, మిగతా సగం మంది పాఠశాలలను నడిపించాలని సూచించారు.