కరీంనగర్

రోళ్లవాగుకు నీరందిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, నవంబర్ 15: భూస్వామ్య,పెత్తందారుల దురహంకార పాలనకు వ్యతిరేకంగా దోపిడీవర్గాలపై పోరాటం సాగించిన జగిత్యాల ఉద్యమాల పోరుగడ్డపై పేద ప్రజల బావుటా ఎగరేస్తానని మాజీ సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం మావోయిస్టు అగ్రనేత, మాజీకేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి స్వగ్రామమైన బీర్‌పూర్ గ్రామంలో జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూస్వామ్య, పెత్తందార్లకు వ్యతిరేకంగా ఉద్యమ పోరుసల్పిన జగిత్యాల నుండి పేదప్రజల గొంతుకగా పోరాటం సాగిస్తానని అన్నారు. నియంతృత్వ రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు మహాకూటమికి పట్టం కట్టాలని కోరారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కులను కాలరాస్తూ నియంతృత్వ పోకడలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను ఎత్తివేసేందుకు ప్రయత్నించగా హైకోర్టు మొట్టికాయలు వేసిందని అన్నారు.ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామన్న సోయిని మరిచిన కేసీఆర్ ప్రజాఉద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీలకు 2వందల యూనిట్ల వరకు గృహవినియోగానికి విద్యుత్తును ఉచితంగా అందిస్తామన్నారు.గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా రోళ్లవాగు ప్రాజెక్టుకు నీరందించే పథకానికి రూ.100కోట్లు కేటాయించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.