కరీంనగర్

ఎన్నికల రోజున ఈవీఎంలను.. ‘తనిఖీ చేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 15: జిల్లాలో 2018 డిసెంబర్ 7న జరుగు శాసన సభ ఎన్నికల పోలింగ్ రోజున ఎన్నికల సిబ్బంది ఈవీఎం యంత్రాలను ఒకసారి తనిఖీ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ, పిజీ కళాశాలలో ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రీసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజు ఉదయం 6.15 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఈసారి ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల్లో కొత్తగా వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టిందని, దీనిపై ప్రీసైడింగ్, అసిస్టెంట్ ప్రీసైడింగ్ అధికారులు క్షుణ్ణంగా అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. తప్పనిసరిగా ఉదయం 6.15 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించాలని, సుమారు 50 ఓట్లు పోల్ అయ్యేలా చూడాలన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను బ్యాలట్ యూనిట్ల బటన్లు నొక్కి సరి చూసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఈవీఎం యంత్రాలు తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ముందు వీవీ ప్యాట్లను లాక్ చేసి తీసుకెళ్లాలని తెలిపారు. ఇలా లాక్ చేసి తీసుకెళ్లడం వల్ల వీవీ ప్యాట్లలోని పేపర్ రోల్, స్పెన్సర్లు పడిపోకుండా ఉంటాయని ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించారు. వీవీ ప్యాట్లలో ఏమైనా సమస్యలుంటే సంబంధిత సెక్టోరల్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి కొత్తవి తెప్పించుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు అందజేసిన కరదీపిక పుస్తకాలను చదువుకోవాలని తెలిపారు.