కరీంనగర్

ఊపందుకున్న నేతల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 16: రెండు మాసాలుగా కొనసాగుతున్న ముందస్తు ఉత్కంఠ ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో పాటు నామినేషన్ల స్వీకరణ కూడా కొనసాగుతుండగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేయబోతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా దాదాపుగా ఖరారయ్యారు. నామినేషన్లు కూడా దాఖలు చేసి ప్రచారంలో వేగం పెంచటంతో, అన్ని పార్టీల కేడర్‌లో జోష్ నెలకొంది. నిన్నటిదాకా కేవలం టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రమే ప్రచార పర్వంలో ముందుండగా, రెండు రోజుల నుంచి అన్ని పార్టీలు నువ్వా,నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లో మైకులు హోరెత్తుతున్నాయి. ప్రచారానికి మరో 20రోజులు మాత్రమే గడువుండటంతో, క్షేత్రస్థాయిలో తమ అభ్యర్థులు, గుర్తులు వెళ్ళేలా ఆయా పార్టీలు ముమ్మరం చేశాయి. ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే, చేపట్టబోయే అభివృద్ధిని వివరిస్తూ, మేనిఫెస్టోతో ఓటరు దేవుళ్ళ ప్రాపకం పొందేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నాయి. టికెట్ ఖరారైందే తడవుగ్రామాల బాట పట్టిన అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతుండగా, ఆయా పార్టీల నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ, ఓటర్ల నాకర్షించేందుకు నానాతంటాలు పడుతున్నారు. మేనిఫెస్టోల్లో పొందుపర్చిన హామీలపై స్పష్టత నిచ్చేందుకు ఆయా పార్టీల అగ్రనేతలను రప్పించి, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెరాస తన అభ్యర్థులను గెలుపించుకునేందుకు ఆపధ్దర్మ సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈనెల 20న హుజురాబాద్, సిరిసిల్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఆపార్టీ జిల్లాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే, మహాకూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకోసం కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెజసల అగ్రనేతలు ప్రచారానికి రానున్నారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతిలు నేడు నగరంలోపర్యటించి, పలుకూడళ్ళలో నిర్వహించనున్న రోడ్‌షోలలో పాల్గొనున్నారు. ఈనెల 18న ప్రజాగాయకుడు గద్దర్ కూడా మహాకూటమికి మద్ధతుగా నగరంలోనిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనున్నట్లు, ఆదివారం సాయంత్రం సర్కస్ గ్రౌండ్‌లో తలపెట్టిన సభలో పాల్గొని, కూటమి అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారం చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ, కొత్త జిల్లా కేంద్రాల్లో ఆపార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభలు, అసెంబ్లీ కేంద్రాల్లో పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో రోడ్ షోలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కూటమి భాగస్వామ్యపక్షాల రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కూడా ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తుండగా, ఆయా నేతల పర్యటనకు సంబంధించిన రూట్‌మ్యాప్ రూపొందించటంలోజిల్లాకాంగ్రెస్ నిమగ్నమైంది.

కుల వృత్తులను గౌరవించిన తెరాస
జమ్మికుంట, నవంబర్ 16: కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టిఅర్ ఎస్ ప్రభుత్వం కుల వృత్తులను గౌరవిస్తు,అభివృద్ది కోసం పని చేసిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్‌లో మేదరి (మహేంద్ర) కులస్థుల అత్మీయ సమ్మేళనం సభ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గ్రామిణ ప్రాంతంలోమనవ సంబంధాలతో కుల వృత్తుల కోనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర ఎర్పాటుతో కుల వృత్తుల సంక్షేమానికి ప్రభుత్వ పెద్ద పీట వేసిందన్నారు.మేదరి కలస్థుల సంక్షేమానికి ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. హైద్రాబాద్‌లో మేదరి కులస్తుల అత్మగౌవరం కోసం భవణం నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు.ప్రతి ఒక్కరికి పని కల్పించి,అర్థిక అభివృద్దికి పాటు పడుతున్న టిఅర్ ఎస్ ప్రభుత్వన్ని అశీర్వాదించాలని కోరారు. మచ్చలేకుండా సేవా చేస్తానని,రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి వెంకట్రాముడు, జిల్లా అధ్యక్షులు రాజనర్సు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవిందర్,మండల అధ్యక్షులు కుచనపల్లి వెంకటేశ్వర్లు,గణేష్,చింతల సతీష్‌తోపాటు వందలాది మంది మేదరి కులస్థులు పాల్గోన్నారు.