కరీంనగర్

నవంబర్ 13 వరకూ వివిధ పార్టీల ఖర్చు రూ.1.47 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 16: జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో నవంబర్ 13 వరకు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చుల కింద రూ.1,47,72,355 ఖర్చు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ రూ.1,13,29,872 ఖర్చు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రూ.20,56,904 బిజెపి పార్టీ రూ.13,73,979, స్వతంత్ర అభ్యర్థులు రూ.11,600, జిల్లాలో ఇంతవరకు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో నవంబర్ 13 వరకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.38,28,234, చొప్పదండి నియోజకవర్గం పరిధిలో రూ.3,99,373, మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో రూ.1,60,278, హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో రూ.1,03,84,470 ఖర్చు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 13 వరకు అయిన ఖర్చులు ఆయా పార్టీల ఖాతాలలో జమ చేయబడుతాయని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుండి ఖర్చులు సంబంధిత రాజకీయ పార్టీ అభ్యర్థుల ఖాతాలలో జమ చేయబడుతాయని జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.
హుజూరాబాద్‌లో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించాలని, ఓటర్లకు ఓటింగ్‌కు ఇబ్బంది పడకూడదన్నారు. ఈ వి ఎం లపై ఎలాంటి సాంకేతిక ఇబ్బందులున్నా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, వాటిని సత్వరంగా పరిష్కరిస్తారని తెలిపారు. ఈ వి ఎం లు, వివి ప్యాట్‌ల ఎలా నిర్వహించాలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.