కరీంనగర్

‘ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్సే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, నవంబర్ 16: వేములవాడ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులను అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించామని, 2006 సంవత్సరంలో మల్యాల గ్రామానికి విచ్చేసిన దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లగా రూ.1737 కోట్లను మంజూరు చేశారని, అట్టి నిధులతోనే పనులు జరిగాయని, చివరి దశలో ఆయన మరణానంతరం పనుల్లో జాప్యం జరిగిందని గుర్తు చేశారు. చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను నిర్మించలేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వమే చేపడుతుందని మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇట్టి నిధులకోసం తాను కృషి చేయలేదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్‌రూంలు, దళితులకు మూడెకరాల భూమి, కేజి టు పిజి వరకు ఉచిత విద్య, రైతులకు రుణమాఫీని విస్మరించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెనిఫెస్టోలో పొందుపర్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. మూడుసార్లు స్వల్ప మెజారిటీతో ఓడిన ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే, అతని తండ్రి 40 సంవత్సరాలుగా గెలుపొందిన ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. మండల కేంద్రంలో వెయ్యి మందితో భారీ మోటర్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు.

రాజకీయ సమాధికి కుట్ర

-కేసీఆర్ కుటుంబంపై ధ్వజమెత్తిన బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ

గంగాధర, నవంబర్ 16: చొప్పదండి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ప్రతీ కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన తనకు టికెట్ ఇవ్వకుండా రాజకీయంగా నన్ను సమాధి చేయడానికి కేసిఆర్ కుటుంబ సభ్యులు కుట్ర పన్నారని, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో గెలుపొందుతానని చొప్పదండి తాజా, మాజీ ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి బొడిగె శోభ అన్నారు. శుక్రవారం గంగాధర మండల కేంద్రంలో జరిగిన చొప్పదండి నియోజకవర్గ స్థాయి బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ 70 రోజులుగా టిఆర్‌ఎస్ టికెట్ కోసం ఎదురు చూసిన తనకు టికెట్ ఇవ్వకపోవడంతో పాటు టికెట్ ఇవ్వనని కూడా చెప్పకుండానే తనను అవమానం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసిఆర్ కుటుంబ సభ్యుల కాళ్లు మొక్కకపోవడంతోనే తనకు టికెట్ కేటాయించలేదని ఆమె విమర్శించారు. భారతీయ జనతా పార్టీ తనను అక్కున చేర్చుకొని చొప్పదండి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందని, నాతో వచ్చిన కార్యకర్తలతో పాటు బిజెపి కార్యకర్తలందరు సమైక్యంగా పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించేలా పాటుపడాలన్నారు. కొడిమ్యాల మండలం నల్లగొండ నర్సింహాస్వామి ఆశీర్వాదం తీసుకొని శనివారం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఆరు మండలాల్లోని మహిళలు, ప్రజలు తనను ఆదరించాలని ఆమె వేడుకున్నారు.