కరీంనగర్

నేరస్తులకు శిక్ష పడితే.. నేరాలు తగ్గుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 17: నేరస్తులకు శిక్ష పడటంలో, వాటిని పెంచడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీడీవోలు ఇచ్చిన సూచనలను దర్యాప్తు అధికారులు పాటిస్తూ న్యాయ, పోలీసు శాఖలు సమన్వయంతో వెలుతుందని జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.సురేందర్ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ ఒక నేరంలో నేరస్తులకు శిక్ష పడితే అది ఎక్కువ మందిని ప్రభావితం చేసి సమాజంలో నేరాల సంఖ్యను కూడా తగ్గేలా దోహద పడుపతుందని తెలిపారు. సెనే్సషనల్ కేసులను గుర్తించి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం ముఖ్యమన్నారు. ఏదైనా నేర విచారణలో విచారణ అధికారికి ఏమైనా సలహా కావాలన్నా, సందేహలు ఉన్నా తమను సంప్రదించవచ్చని, తమ సహాయ సహకారాలు ఎల్లపుడు అందించి కన్విక్షన్ రేట్ పెంచేలా కృషి చేస్తామని తెలిపారు.

అన్నివర్గాల్లో వెలుగులు నింపాం
- ఊటూర్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ వినోద్‌కుమార్
మానకొండూర్, నవంబర్ 17: అన్నివర్గల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేదుకు సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అదర్శంగా నిలిచిందని కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ అన్నారు. శనివారం మండల పరిధిలోని లలితపూర్, ఊటూర్ గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో ఎంపి వినోద్‌కుమార్ పాల్గొన్నారు. ఊటూర్ గ్రామంలో ఎంపి వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు మహిళలు మంగళహారతితోకోలాట, డప్పుచప్పులతో మహిళలు బోనాలు ఎత్తుకుని ఘనస్వాగతం పలికారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ రెప్పపాటు కూడ కరెంట్ పోకుండా రైతాంగానికి నాణమైన ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు. తెలంగాణ వస్తేఅంధకారం అవుతుందని కాంగ్రెస్‌ల్లో ఎద్దేవా చేసిన్నారని విమర్శించారు. రైతును రాజుగా చూడాలన్నాలక్ష్యంతో సిఎం కేసిఆర్ సాగునీటి ప్రాజేక్టులు చెపట్టారని తెలిపారు. రాష్టన్న్రి బంగారు తెలంగాణగా మార్చెందుకు కేసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. మానకొండూర్ నియోజకవర్గం గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి జరుగలేదన్నారు. టీఆర్‌ఎస్ నాలుగెళ్లన్నర యెళ్ల కాలంలో రసమయి బాలకిషన్ ఎంతో అభివృద్ధి చేసిన్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కళ్యాణలక్ష్మి పథకం కింద రాభోయే రోజుల్లో రూ. 2లక్షలను కేసిఆర్ ప్రభుత్వం అందించనుందని తెలిపారు.టీఆర్‌ఎస్ పాలనలోనే దళితులు అభివృద్ధి చెందిన్నారని తెలిపారు. సీమాంద్ర పాలకుల చేతిలో తెలంగాణ జనం బతుకులు ఆగమైన విషయం మరవక ముందే మరోసారి మరోమోసం చేసేందుకు మహాకుటమి పేరుతో చంద్రబాబు వచ్చారని విమర్శించారు. మహాకుటమి దొంగల పార్టీని ప్రజలు నమ్మవద్దని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగాలంటే కేసిఆర్, రసమయి బాలకిషన్‌ను మరోసారి ప్రజలు ఆశీర్వాదించి గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రసమయి బాలకిషన్ కారుగుర్తుకే ఓటువేసి గెలిపించాలని తెలిపారు.