కరీంనగర్

మహా సందిగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 17: ముందస్తు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగింపుదశకు వస్తున్నా, మహాకూటమిలో మాత్రం ఇంకా సందిగ్ధం వీడటం లేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు సీపీఐకి కేటాయించిన హుస్నాబాద్‌తో కలిపి మొత్తం 11 సెగ్మెంట్లలోఅభ్యర్థులను ప్రకటించగా, కోరుట్ల, హుజురాబాద్ సీట్లపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శనివారం మధ్యాహ్నం ప్రకటించిన కాంగ్రెస్ మూడో జాబితాలో కూడా ఈ రెండు స్థానాల నుంచి అభ్యర్థులను ప్రకటించకపోవటంతో, ఆయాచోట్ల నుంచి పోటీ పడుతున్న ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. దీనికితోడు రాజధానిలో కేటాయించిన సీట్లలో టీడీపీ నుంచి టికెటు ఆశించిన ఇనుగాల పెద్దిరెడ్డికి చుక్కెదురు కాగా, హుజురాబాద్ నుంచి బరిలోకి దించేందుకు యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, ముద్దసాని కశ్యప్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీ నుంచి ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదు. అలాగే, కోరుట్ల నుంచి పలువురు కాంగ్రెస్ ఆశావహులు పోటీపడుతుండగా, వారిలో మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి జ్యోతక్క, జువ్వాడి సోదరులైన నర్సింగారావు, కృష్ణారావులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్ తమ నేతకే కేటాయించాలంటూ కొమొరెడ్డి వర్గీయులు ఏకంగా, వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతోఖంగుతిన్న కాంగ్రెస్ వారిని బుజ్జగించటంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తట్టుకోలేక, ఆ సీటు కూడా టీడీపీకే కేటాయించేందుకు సమాలోచనలు చేస్తూ,లోలోన మంతనాలు కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో నామినేషన్లకు నేడు ఆఖరి రోజు కావటంతో తెదేపా నుంచి ఈరెండు చోట్ల అభ్యర్థిత్వాలు ఆశిస్తున్న వారిని కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలంటూ ఆపార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు వినికిడి. కాగా, ఈ రెండు చోట్ల నుంచి అభ్యర్థిత్వాలు ఆశిస్తున్న నేతలు హైద్రాబాద్, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, తమ పేర్లు ఖరారు చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు.
తమ గాడ్‌ఫాదర్‌ల వద్ద పడిగాపులు కాస్తూ, అధినేత రాహుల్ గాంధీని సైతం మెప్పించే యత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఓవైపు నామినేషన్ల తుది అంకానికి చేరుకుంటుండగా, మరోవైపు జిల్లాలోని రెండు ప్రధాన స్థానాలపై కూటమిలో స్పష్టత రాకపోవటంతో రెండు పార్టీల కేడర్ వేచి చూస్తూ, ఆయా పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.