కరీంనగర్

మీ కన్నీళ్ళు తుడుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, నవంబర్ 17: శ్రమతో జీవనం సాగించే హామాలీ కార్మీకులు, శ్రామికులైన మీ కన్నీళ్ళు, కష్టాలు తీర్చే విధంగా మీ బిడ్డగా పని చేస్తానని అపద్దర్మ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని యంపిఅర్ గార్డెన్‌లో హుజురాబాద్ నియోజకవర్గస్థాయి హామాలీ కార్మికుల అత్మీయ అశీర్వాద మద్దతు సభ శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ మార్కెట్, ఐకెపి కేంద్రాలలో పని చేస్తున్న హామాలీ కార్మికులు, రైతులు బాగుంటేనే,రెండు సీజన్‌లలో పని దొరుకుతుందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అములు చేస్తుందన్నారు. రైతుల పోలాలు ఎండిపోతున్నయంటే,సింగూరు జలాలు , ఎస్ అర్ ఎస్‌పికి మళ్ళించి సాగుకు నీరు అందించామన్నారు. పంటలు కాపాడుతుంటే కాంగ్రేస్ వాళ్ళకు కడుపు మంటగా మారిందన్నారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు శర వేగంగా పూర్తవుతుందని,రెండు పంటలకు వారబంది లేకుండా నీళ్ళు అందిస్తామన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు అధికారం కోసం హామీలు ఇస్తున్నయన్నారు. టిఅర్ ఎస్ ప్రభుత్వం విద్య,వైద్యం, విద్యార్థులకు సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి, రైతు పెట్టుబడి, రైతు భీమాతోపాటు రానున్న ఎన్నికల మ్యానీఫెస్టోలో నిరుద్యోగులకు సంవత్సరానికి 36 భృతి, ఇల్లు కట్టుకునే వారికి 5లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. అనాడు ఉద్యమంలో ఢీల్లీ మెడలు వంచేందుకు రైల్వే గేట్లు వద్ద 72 గంటలు బంద్ చేస్తే, కేసులకు బయపడకుండా దైర్యంగా ఉద్యమంలో పోరాటం చేశారని, హామాలీ కార్మికుల కోసం హెల్త్‌కార్డులు, భవణ నిర్మాణం కోసం నిధులు, స్వయం ఉపాధి కోసం బ్యాంక్ సంబంధంలేకుండా రుణాలు, కార్మీకులకు 5లక్షల భీమా అందిస్తామన్నారు. ఇంక సమస్యలు ఉన్నయని, పరిష్కరించవలసిన అవసరం ఉందని కార్మికులు బాదలు తీరుస్తానని హామీ ఇచ్చారు. హామాలీ కార్మికలు ఇంటి వద్ద, ఉరూర తిరిగి ఐక్యతతోప్రచారం చేసి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.