కరీంనగర్

ఓట్ల విప్లవం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 18: తెలంగాణలో ఓట్ల విప్లవంతోనే దొరల పాలనకు చరమగీతం పాడాలని ప్రజాగాయకుడు గద్దర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ సర్కార్ గ్రౌండ్‌లో మహాకూటమి సాంస్కృతిక బహిరంగ సభను ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ జిల్లా నుంచే మార్పు కోసం ఓర్పు, నేర్పుతో ఓట్ల విప్లవంతో దొరల పాలన ఇకనైనా పోవాలని, ప్రజాకూటమి పాలనను అధికారంలోకి తీసుకురావాలన్నారు. భారత రాజ్యాంగం అన్ని మతాల వారికి పవిత్ర గంధం లాంటిదన్నారు. డాక్టర్ వినయ్, జహీర్ అలీఖాన్, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, కేజీటుపీజీ ఉచిత విద్య, ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, కర్ర రాజశేఖర్, మాజీ మేయర్ శంకర్, దళిత ముస్లీం యునైటెడ్‌ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మెండి చంద్రశేఖర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి, జగ్గారెడ్డి పాల్గొన్నారు.