కరీంనగర్

నామినేషన్ ఘట్టానికి నేటితో తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 18: ముందస్తు ఎన్నికల్లో ముఖ్యమైన రెండో ఘట్టానికి నేడు తెర పడనుంది. ఎన్నికల్లోపోటీ చేయబోయే అభ్యర్థుల నామినేషన్ల పర్వం సోమవారంతో ముగియనుండగా, టికెట్లు ఆశించి భంగపడ్డ పలు పార్టీల నిరాశావహులు తిరుగుబావుటా ఎగరేసే దిశగా ముందుకెళ్తున్నారు. తమకే టికెట్లు ఖరారవుతాయనే ధీమాతో ఆయా పార్టీల పేర ఇప్పటికే దాఖలు చేసిన పలువురికి మొండిచేయి ఎదురుకాగా, పలువురు నేడు స్వతంత్రులుగా బరిలోకి దిగేందుకు నామినేషన్లు వేయబోతున్నారు. తీవ్ర పోటీ ఉన్న పలు సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించకపోవటంతోకోరుట్ల, హుజురాబాద్ సెగ్మెంట్లపై మహాకూటమి నుంచి బరిలోకి దిగాలని ఆశించిన వారిలో ఆదివారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఆశావహుల మద్య సయోధ్య కుదిర్చేందుకు చివరి వరకు యత్నించినా ఫలితం కానరాకపోగా, ఈనెల 18 అర్ధరాత్రి ఈ రెండు స్థానాల నుంచి అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు అసమ్మతి రాగం అందుకుని, స్వతంత్రులుగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయా పార్టీల నేతలు మాత్రం రెబెల్స్‌ను బుజ్జగించటంలో పట్టు వీడటం లేదు. తమ వర్గం నేతలకు టికెట్లు లభించలేదంటూ కొన్నిచోట్ల కార్యకర్తలు కూడా అలకబూనగా, వారిని ఒప్పించేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఎన్నికల అనంతరం కూటమియే అధికారంలోకి రాబోతున్న దృష్ట్యా, భవిష్యత్ ఉంటుందంటూ మచ్చిక చేసుకునే యత్నం చేస్తుండగా, ఇంకా దారికి రావటం లేదని ఆయా పార్టీల నేతలు పేర్కొంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువువరకైనా వీరిని తమ గట్టుకు చేర్చుకోవాలనే పట్టుదలతో ఆయా పార్టీల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. కాదు..పోదంటే సస్పెన్షన్ల అస్త్రం ప్రయోగించేందుకు కూడా వెనుకాడేది లేదంటూ తేల్చి చెబుతున్నట్లు వినికిడి. దీనికితోడు టికెట్లు రాలేదని మనస్థాపం చెంది ఇప్పటికే పలు పార్టీల నుంచి నాయకులు ఇతర పార్టీల కండువాలు కప్పుకున్నారు.
నామినేషన్లు ముగిసిన అనంతరం మరికొంత మంది నేతలు కూడా తమ తమ పార్టీలు వీడేందుకు ఉద్యుక్తులవుతున్నట్లు తమ తమ అనుచర గణానికి అంతర్గతంగా సంకేతాలిస్తున్నారు. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీల్లో కూడా ఇదే తీరు నెలకొనగా, వలసల నిలుపుదలపై జిల్లాస్థాయి నాయకులు ఆలోచిస్తుండగా, అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన నెలకొంది.