కరీంనగర్

నిరాడంబరంగా ఈటల నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, నవంబర్ 19: హుజూరాబాద్ నియోజకవర్గ టి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సోమవారం నామినేషన్ దాఖలు చేసారు. నిరాడంబరంగా ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్ డి వో బోయపాటి చెన్నయ్యకు సమర్పించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కూటమి ఎత్తులు చిత్తవుతాయని, రాబోయే ఎన్నికల్లో ప్రజాతీర్పు టి ఆర్ ఎస్ పార్టీకి పూర్తి అనుకూలంగా రాబోతోందని, కూటమిని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు. కూటమి ఎన్ని వాగ్దానాలు చేసిన ప్రజలు విశ్వసించడం లేదని, టికెట్ల కేటాయింపులోనే వారి శక్తి సామర్థ్యాలు ఏమిటో బయటపడ్డాయని అన్నారు. టి ఆర్ ఎస్ వంద స్థానాలకు పైగా గెలుచుకుంటుందని ఈటల అన్నారు.
హుజూరాబాద్‌లో మొత్తం 26 నామినేషన్లు
హుజూరాబాద్‌లో నామినేషన్ల ఘట్టం సోమవారం సాయంత్రం పూర్తవడంతో మొత్తం 26 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 14 మంది ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేయగా 12 మంది అభ్యర్థుల వివిధ పార్టీల నుండి నామినేషన్లు వేసారు. టి ఆర్ ఎస్ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి పాడి కౌశిక్‌రెడ్డి, బిజెపి తరపున పుప్పాల రఘు నామినేషన్ వేసారు. ఎంసిపి ఐ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, జై మహాభారత్, తెలంగాణ ప్రజాసమితి, సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్, బి ఎస్పీ, అఖిల భారతీయజనసంఘ్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ , పిరమిడ్ పార్టీ నుండి కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసారు.