కరీంనగర్

కాంగ్రెస్,టీఆర్‌ఎస్‌లకు ఓట్లేస్తే.. మజ్లిస్‌దే నిర్ణయాధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, నవంబర్ 19: అధికారం కోసం ఎన్ని అడ్డదారులు అయినా తొక్కే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు ఓటేస్తే పరిపాలన నిర్ణయాధికారం ఓవైసీ సోదరుల చేతుల్లోకి వెళ్తుందని కరీంనగర్ అసెంబ్లీ బీజేపి అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. అధికారమే పరమావధిగా వెంపర్లాడుతున్న గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్‌లు మజ్లిస్ పార్టీ విధించే షరతులకు తలొగ్గేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఓవైసీ సోదరులు సూచించిన వ్యక్తికే ఇచ్చేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు పోటీపడుతున్నాయని విమర్శించారు. గతంలో ఎంఐఎం పార్టీ ప్రజాప్రతినిధులు కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నో రకాల సామాజిక సమస్యలకు కారణమయ్యారని వారి కారణంగా అధికార యంత్రాంగంపై రాజకీయ ఒత్తిళ్ళు పెరిగాయని అన్నారు. ఎంఐఎం పార్టీ ఒత్తిళ్ళతో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న కేసులు సైతం నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు దక్కుతుందని సంజయ్ విమర్శించారు. గతంలో ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన పేలుళ్ళ కేసు దర్యాప్తును మజ్లిస్ ఒత్తిళ్ళ మేరకు మూసివేశారని, అందుకు కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో విజయవంతమైన ఎంఐఎంతో ఉన్న లోపాయికారి ఒప్పందాన్ని మరోసారి ప్రయోగించేందుకు కాంగ్రెస్ టీఆర్‌ఎస్ అభ్యర్థులు తెగించారని, ప్రజలు గమనించి వారికి బుద్ది చెప్పి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి బీజేపీకి అవకాశం ఇవ్వాలని సంజయ్ వేడుకున్నారు. మైనార్టీ సంతుష్టీకరణ విధానాలతో పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాల్లో సైతం లబ్ధిదారుల జాబితాలో కాంగ్రెస్, తెరాస పార్టీలు అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. కేవలం అధికారం కోసమే ఎంఐఎం తొత్తులుగా మారి నిరుపేదల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. నగరంలో సీనియర్ సిటిజన్స్‌తో ఎన్నికల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన వెంట భాజపా సీనియర్ నాయకులు బాస సత్యనారాయణరావు, నాయకులు ముప్పిడి సునీల్‌కుమార్, దుర్శేటి సంపత్, కటకం లోకేష్, సింగిరాల రామరాజు, తోట సాయికృష్ణ, ఎండి ముజీబ్, దులం కళ్యాణ్, శశి, రామకృష్ణ, ధీరజ్, తదితరులు పాల్గొన్నారు.