కరీంనగర్

నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 20: జిల్లాలో జరుగుచున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు నిరూపణ జరిగితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ సమావేశమందిరంలో జాయింట్ కలెక్టర్ జి.వి.శ్యాం ప్రసాద్‌లాల్‌తో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, హోటల్ నిర్వాహకులు, బ్యాంకెట్ హాళ్ల నిర్వాహకులు, మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి-ఎన్నికల ప్రవర్తన నియమావళి)ని పకడ్బంధీగా అమలు చేసేందుకు ఎన్నికల ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిఘా ముమ్మరంగా ఉంటుందని తెలిపారు. హోటల్స్‌లో, ఫంక్షన్ హాల్స్‌లో రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు నిర్వహించుకునే సమావేశాలకు తప్పనిసరిగా సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల అనుమతి ఉండాలన్నారు. అనుమతి లేకుంటే సంబంధిత హోటల్స్, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు జిల్లా ఎన్నికల సంఘానికి, రిటర్నింగ్ అధికారులకు లేదా పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనుమతి లేకుండా నిర్వహించుకునే రాజకీయ సమావేశాల ఖర్చులను పోటీ చేసే అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తామని, సమాచారం ఇవ్వనందుకు హోటల్, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హోటల్స్‌లో నిర్వహించే ఫంక్షన్‌కు మద్యం వాడకం ఉంటే ఎక్సైజ్ లిక్కర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. అలా లేకుంటే కేసులు బుక్ చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫంక్షన్ హాల్స్‌లో ఇప్పటివరకు సీసీ కెమెరాలు లేకుంటే నిర్వాహకులు తప్పనిసరిగా ఈ నెల 25వ తేదీ లోపు సీసీ కెమెరాలు బిగించాలని అన్నారు. హోటల్స్, ఫంక్షన్ హాల్స్‌లో నిర్వహించే కార్యక్రమాలపై నిర్వాహకులు విచక్షణతో వ్యవహరించాలని, సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరం
- రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ
గోదావరిఖని, నవంబర్ 20: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమని రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా కమీషనరేట్ పరిధిలోని రామగుండం సర్కిల్ అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 50 సిసి కెమరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ శాంతి భద్రతలలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నేర రహిత తెలంగాణ సాధనలో భాగంగా సిసి కెమరాలను ఏర్పాటు చేయడానికి నేను సైతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. సిసి కెమరాల ఏర్పాటుతో ఏదైనా సంఘటన జరిగితే నిందితులను, నేరస్తులను సులభంగా గుర్తించవచ్చని అన్నారు. నేరస్థులకు శిక్ష పడటంలో ఈ కెమరా ఫుటేజీలు ఆధారాలుగా ఉపయోగపడుతాయని చెప్పారు. కమీషనరేట్ పరిధిలో నేను సైతం కార్యక్రమంపై వివరిస్తూ దాని ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ నేను సైతం రక్షణలో భాగస్వామ్యం అవుతామని, ఇందులో భాగంగా సిసి కెమరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, గ్రామాల్లో సిసి కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.