కరీంనగర్

ఎవరి ప్రయోనాల కోసం విమోచనా దినాన్ని.. నిర్వహించటం లేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, నవంబర్ 20: తెలంగాణ స్వాతంత్య సంబురాలను విమోచన దినోత్సవం రోజున అధికారికంగా నిర్వహించకపోవటం వెనుక ఆంతర్యమేంటని, ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ఆత్మభిమానం తాకట్టుపెడుతున్నారోప్రజలకు తెలుసని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నగరంలోని 26వ డివిజన్‌లో ఆయన పాదయాత్ర చేపట్టి, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, విమోచన దినం కూడా అధికారికంగా నిర్వహించుకోలేని దౌర్భాగ్య స్థితి రాష్ట్ర ప్రజలకు దాపురించిందని, ఇందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ యే ప్రధాన దోషిగా ఆయన అభివర్ణించారు. ఎంఐఎం పార్టీ, ఓవైసీ సోదరులను ప్రసన్నం చేసుకునేందుకే సెప్టెంబర్ 17 సంబురాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో విభజించి, పాలించిన రాష్ట్ర ప్రభుత్వమే కుల,మతాల పేర విభజిస్తూ, ఇతరులపై విమర్శలకు దిగుతోందని మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా వ్యవహరిస్తుండటం దగాకోరు తనానికి నిదర్శనమన్నారు. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 వేడుకల కోసం ఉద్యమ నేతగా కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోసిన కేసీఆర్ కాంగ్రెస్ బాటలోనే నడిచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రను అవమానించారని సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. నిజాం సర్కారుకు రజాకార్లకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున సాగిన విమోచన ఉద్యమాన్ని, నాలుగు దశాబ్దాల పాటు సాగిన తొలి,మలి దశల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలు అన్ని ప్రజల స్వాభిమాన ఆత్మగౌరవ పోరాటాలుగా బీజేపీ గుర్తించిందన్నారు. దుకే అన్ని పార్టీల కంటే ముందుక ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సమర్ధించి బాసటగా నిలిచి పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిందని వివరించారు. తెలంగాణ ప్రజల మనోభవాలకు తిలోదకాలిచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీని, చంద్రబాబు మార్గదర్శనంలో కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగుతున్న మహాకూటమిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బీజేపికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా 26వ డివిజన్‌లోని కోతిరాంపూర్, అలకాపురి ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ, ఓట్లు అభ్యర్థించారు. ఈయాత్రలో బీజేపీ నాయకులు మాసం గణేశ్, ప్రవీన్, యసరాజు, చంద్ర, శ్రీకాంత్, తోట బాబు, రాకేశ్, రాఖీ, రాహుల్, రమేశ్, ప్రశాంత్‌తో పాటు 200మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

నారాయణపూర్ రిజర్వాయర్.. పనులు త్వరలోనే పూర్తి
-కేడీసీసీ డైరెక్టర్ తిరుమల్ రావు వెల్లడి
గంగాధర, నవంబర్ 20: అసంపూర్తిగా ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువ పనులు శాసనసభ ఎన్నికల అనంతరం పూర్తి చేసి మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించడం జరుగుతుందని కెడిసిసి డైరెక్టర్ వెలిచాల తిరుమల్ రావు అన్నారు. గంగాధరలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కురిక్యాల సింగిల్‌విండో చైర్మన్‌గా, రైతు నాయకునిగా గత 25 సంవత్సరాల నుండి రైతుల సంక్షేమం కోసం తాను పోరాటం చేస్తున్నానని, గంగాధర చౌరస్తాలోని విలువైన భూముల సేకరణలో జాప్యం జరుగడం వల్లనే నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువ పనులు పూర్తి కాలేదన్నారు. స్థానిక ఎంపి ద్వారా వచ్చే ఎన్నికలలో గెలుపొందే ఎమ్మెల్యే ద్వారా బాధితులకు పరిహారం అందించి కాలువ పనులు పూర్తి చేసి బీడు భూములు సస్యశ్యామలం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. చొప్పదండి శాసనసభ ఎన్నికలలో గతంలో గెలుపొందిన రాంకిషన్ రావు తరువాత స్థానికేతరులే ఇక్కడ గెలుపొందడం ద్వారా అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుతం ఎన్నికలలో స్థానికుడైన టిఆర్‌ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్‌ను గెలిపించడం ద్వారా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేసి అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎంపిటిసి అలువోజు నందయ్య, మాజీ సర్పంచ్ మేర్జ కొండయ్య, అంబేద్కర్ సంఘాల నాయకులు లంకదాసరి కనుకయ్య, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సుద్దాల గంగారెడ్డి, గుంటి లక్ష్మణ్, ఇప్పలపల్లి మదుసూధన్, మిల్కుల నరేష్, సరిపెల్లి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.