కరీంనగర్

తిరుగుబాట్లతో తిప్పలేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 20: ముందస్తు ఎన్నికలు ఆయా పార్టీల అధికారిక అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అభ్యర్థిగా ఖరారయ్యేందుకు నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకుని, బిఫామ్ తెచ్చుకుని బరిలో నిలిచిన అభ్యర్థుల గుండెల్లో రె‘బెల్స్’ గునపాలు దిగబోతున్నాయి. టికెట్లు లభించని వారంతా తిరుగుబాటుదారులుగా నామినేషన్లు వేసి హడలెత్తిసున్నారు. అధిష్టానాల బుజ్జగింపులకు కొందరు మెత్తబడుతున్నా..మరికొందరు మాత్రం బరిలో నిలుస్తాం..అధికారిక అభ్యర్థుల ఓట్లు చీలుస్తామంటూ తెగేసి చెబుతుండటంతో, ఎంతో కష్టపడి తెచ్చుకున్న బిఫామ్ వృధా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. వీరి పోటీపైనే గెలుపోటములు ఆధారపడే అవకాశాలుండటంతో, బరిలో నిలిస్తే ఎవరి రాజకీయ జీవితం ముగియనుందోననే ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ప్రస్పుటమవుతోంది. రెబెల్స్‌తో పాటు స్వతంత్రులు కూడా జత కలవటంతో ఓట్లుచీలటం తథ్యం కాగా పలువురు అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. దీంతోఎలాగోలా వీరిని తమ దారికి తెచ్చుకుని, తమ వెంట ప్రచారంలో తిప్పుకోవాలని పట్టుదలతో మరికొంతమంది అధికారిక అభ్యర్థులున్నారు. ప్రధానంగా జిల్లాలోని కోరుట్ల, చొప్పదండి, హుజురాబాద్,తదితర నియోజకవర్గాల్లో తిరుగుబాటు నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, ఉపసంహరణకు మరోరోజు గడువుండటంతో, వారిని బుజ్జగించే యత్నం చేస్తుండగా ససేమిరా అంటున్నారు. ఎలాగైనా వీరిని తప్పించి, ఓట్లవేటలో ముందు వరుసలో ఉండాలనే దృఢ సంకల్పంతోతమ తమ అధిష్టానాలను రంగంలోకి దించేందుకు అధికారిక అభ్యర్థులు చివరి యత్నాలు చేస్తున్నారు. కాగా, మరోవైపు తిరుగుబాటుదారులు పోటీలో నిలిస్తే కలుగబోయే లాభ,నష్టాలపై కూడా అంచనాలు వేస్తున్నారు. ఎదుటి పార్టీల అభ్యర్థుల బలాబలాలు అంచనా వేస్తూ, స్వతంత్రులు బరిలో కొనసాగిన నేపథ్యంలో పరిస్థితులు అనుకూలంగా మారే సూచనలుంటే,వారిని అలాగే కొనసాగాలని ప్రోత్సహిస్తున్నారు. నష్టం జరిగే అవకాశాలున్నచోట మాత్రం వెనక్కు తగ్గేలా మంతనాలు సాగిస్తున్నారు. అవసరమైనచోట వారి వారి బంధుగణాన్ని కూడా దించి, ఒప్పించే యత్నాల్లో మునిగిపోయారు. స్వతంత్రుల చేతుల్లోనే పలు పార్టీల అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడటంతో, వారిని ఒప్పించి, మెప్పించేందుకు పడరాని పాట్లు పడుతుండటం ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనిపిస్తోంది.