కరీంనగర్

నన్ను నమ్మితే.. కేటీఆర్, చెన్నమనేనిలను లక్ష మెజారిటీతో గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 20: తమను నమ్మితే సిరిసిల్ల, వేములవాడ తెరాస అభ్యర్థులను లక్ష మెజార్టీతో గెలిపించాలని, అబద్దం అనుకుంటే డిపాజిట్టు రాకుండా చేయండి అని రాష్ట్ర అపద్ధర్మ ముఖ్య మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల తెరాస అభ్యర్థుల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల అభ్యర్థి, తన తనయుడు కల్వకుంట్ల తారకరామారావు, వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబులను లక్ష మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము చేపట్టిన పథకాలు, ఈ ప్రాంతంలో వారు చేస్తున్న అభివృద్ది పనులపై కేసీ ఆర్ వివరించారు. తాము చెప్పేది నిజమైతే లక్ష మెజార్టీతో వీరిని గెలిపించాలని, తాము చెప్పేది అబద్దమని భావిస్తే వీరికి డిపాజిట్లు రాకుండా చేయండని ప్రజలను కోరారు. అలాగే వీరిద్దరు భారీ మెజార్టీతో గెలుస్తున్నారని, ఈరోజే ఉదయం తనకు తాజా సర్వే నివేదిక అందిందని, దాని ప్రకారం 80 శాతం ఓట్లు వీరికే లభించనున్నాయని కేసీ ఆర్ పేర్కొనడం విశేషం.

కూటమి ఊసేలేదు
* విపక్షాలపై విమర్శలు లేకుండా కేసీఆర్ ప్రసంగం
* సభ విజయవంతంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం
హుజూరాబాద్, నవంబర్ 20: హుజూరాబాద్ మండలం శాలపల్లి సమీపంలోని ఇందిరానగర్ వద్ద మంగళవార జరిగిన సీఎం కెసిఆర్ ఎన్నికల ప్రచార సభ సక్సెస్‌తో గులాబీ దండులో ఉత్సాహం నెలకొంది. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం సభాస్థలికి సిద్దిపేట నుండి హెలికాప్టర్ ద్వారా హుజూరాబాద్‌కు చేరుకున్నారు. సీ ఎం కె సి ఆర్ ప్రసంగం సాదా సీదాగా సాగింది. ఆయన తన ప్రసంగంలో టి ఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలు వివరించి మళ్లీ గెలిపించాలని కోరారే తప్ప ఎక్కడా ప్రతిపక్షాలపై విమర్శలు చేయలేదు. సభ సక్సెస్ కోసం మండలాల వారికి సీ ఎం కె సి ఆర్ బాధ్యతలు నాయకులకు అప్పగించారు. భారీగా జన సమీకరణ చేయడంలో సక్సెస్ అయ్యారు. సభ ప్రారంభమైనా ఇంకా చాలా మంది సభా స్థలికి చేరుకోలేకపోయారు. కేవలం పది నిమిషాలే సీ ఎం కె సి ఆర్ ప్రసంగించారు. అంతకుముందు చెల్పూరు నుండే ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రగా టి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సభాస్థలికి తరలివచ్చారు. ఈటల సతీమణి జమునారెడ్డి, కుమార్తె నీతూ రెడ్డి, కోడలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈటల తనకు ఆప్త మిత్రుడని, అలాగే రాజ్యసభ సభ్యులు కెప్టెన్ తనకు పితృసమానులని సీ ఎం కె సి ఆర్ పేర్కొన్నప్పుడు ప్రజలు హర్షధ్వానాలు చేసారు. హుజూరాబాద్‌లో గెలుపు భయం లేదని, ఉద్యమ సమయంలో ఇక్కడ ప్రజలు ఎంతో చైతన్యం చూపారని, ఉద్యమ ప్రతి మలుపులోనూ కెప్టెన్ ఈటల ఉన్నారని కె సి ఆర్ పేర్కొన్నారు. జమ్మికుంట మండల టి ఆర్ ఎస్ నాయకుడు తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు కాకతీయ కాలువకు వచ్చే పంటకు తాగునీరు ఇవ్వాలని చిట్టీ అందించగా కె సి ఆర్ దాన్ని ప్రస్తావిస్తూ రాజేందర్ నీళ్లు ఇవ్వకపోతే ఊరుకుంటారా? బేజాప్త కాదు.. బాజాప్తా నీళ్లిస్తం... ఎగ్జిబిషన్ల పెట్టుకునేందుకు కాదు నీళ్లు.. రైతుల పొలాలకోసమే అని కె సి ఆర్ పేర్కొన్నారు.

టిఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవిందర్‌రెడ్డితో పాటు పలువురు ఈటల రాజేందర్ సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి సీ ఎం కె సి ఆర్ సభకు హాజరయ్యారు.

* పేద ప్రజలకోసమే కెసిఆర్ తపన: రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు
సీఎం కెసిఆర్ అనుక్షణం పేద ప్రజల సంక్షేమం కోసమే పరితపిస్తున్నారని రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు అన్నారు. హుజూరాబాద్ మండలం శాలపల్లి శివారులో మంగళవారం మధ్యాహ్నం జరిగిన సీ ఎం కె సి ఆర్ ఎన్నికల ప్రచార సభలో కెకె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా రూ.45లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి పరీక్షలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పాస్ అవుతూ వచ్చిందని, టి ఆర్ ఎస్ పార్టీకి పరీక్షలు కొత్తకాదని, రాబోయ్యే ఎన్నికల్లోనూ సునాయాసంగా నెగ్గుతుందని ఆయన అన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఉద్యమాలకు పుట్టినిల్లని, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రాంతమని అన్నారు. ఇటు ఉద్యమంలోనూ, అటు ప్రభుత్వంలోనూ చిత్తశుద్దితో క్రమశిక్షణతో పనిచేసామన్నారు. హుజూరాబాద్ ప్రాంతంలో ఎస్సారెస్సీ ఆయకట్టు కింద పంటలు ఎండిపోకూడదనే ఉద్దేశంతో సీ ఎం కె సి ఆర్ సింగూరు జలాలు అందించి గొప్ప మనసు చాటుకున్నారని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం సీ ఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సభలో ఇరిగేషన్ కార్పోరేషన్ ఛైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మైనారిటీ కార్పోరేషన్ ఛైర్మన్ అక్బర్ హుస్సేన్, దేశపతి శ్రీనివాస్, స్థానిక టి ఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.